బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గల్ఫ్

12 articles

గల్ఫ్‌లో ఇరుక్కున్న ఇద్దరు మహిళల ఆర్తనాదం…
జిల్లా వార్తలు

గల్ఫ్‌లో ఇరుక్కున్న ఇద్దరు మహిళల ఆర్తనాదం…

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందిన శిరోమణి, పద్మ అనే ఇద్దరు మహిళలు గల్ఫ్‌లోని మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి పాస్పోర్ట్‌లు అరబ్ షేక్‌ల వద్ద ఉండగా, అదనపు డబ్బు డిమాండ్ కారణంగా స్వదేశానికి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఇండియన్ ఎంబసీ తక్షణం జోక్యం చేసుకోవాలని బాధితులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

9, ఆగ 2026

గల్ఫ్‌లో ఏఐ డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు: యుద్ధ వ్యూహంలో కొత్త మలుపు
అంతర్జాతీయం

గల్ఫ్‌లో ఏఐ డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు: యుద్ధ వ్యూహంలో కొత్త మలుపు

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ ప్రాంతంలోని ఏఐ డేటా సెంటర్లు కొత్త లక్ష్యాలుగా మారడం ప్రపంచ ఆర్థిక, భద్రతా వ్యవస్థలకు ఆందోళన కలిగిస్తోంది. Amazon Web Services సహా పలు కేంద్రాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు సీఎన్‌ఎన్ నివేదిక వెల్లడించింది. గల్ఫ్ దేశాలు ట్రిలియన్ల డాలర్ల ఏఐ పెట్టుబడులు కొనసాగిస్తున్నప్పటికీ, పెరుగుతున్న ముప్పులు, బీమా ఖర్చులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5, ఆగ 2026

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్

అమెరికా–ఇరాన్ చర్చల పునఃప్రారంభంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా ఎదుగుతుండగా, పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపుపై చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ ప్రసంగంలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

5, ఆగ 2026

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..
అంతర్జాతీయం

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..

అమెరికా, ఇజ్రాయిల్‌లను ప్రధాన శత్రువులుగా చూస్తున్న ఇరాన్, ఇప్పుడు ఖతార్, పాకిస్తాన్, ఒమన్ వంటి మధ్యవర్తి, మిత్ర దేశాలపైనా క్షిపణి, డ్రోన్ దాడులు జరుపుతూ ఒత్తిడి పెంచుతోంది. గల్ఫ్ ప్రాంతంలో మధ్యవర్తిత్వం, రవాణా భద్రత దెబ్బతినడంతో పాటు, ఈ దాడులు కొనసాగితే ఇరాన్ అంతర్జాతీయ వేదికపై మరింత ఒంటరై, యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

17, జులై 2026

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు
అంతర్జాతీయం

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌, ఖతార్‌, ఒమన్‌ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్‌ ప్రకటించింది.

13, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు  .. ఉద్రిక్తత.. ఒకరు మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు .. ఉద్రిక్తత.. ఒకరు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

9, జులై 2026

పశ్చిమాసియాలో మళ్లీ  ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ రక్షణ వ్యవస్థలపై వైమానిక దాడులు జరపగా, ప్రతీకారంగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్‌, కువైట్‌లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం ఉన్నప్పటికీ తాజా పరిణామాలు గల్ఫ్‌ భద్రత, ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెంచుతున్నాయి.

8, జులై 2026

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్
అంతర్జాతీయం

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్

పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది.

8, జులై 2026

హర్మూజ్‌ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్‌.. 14 మంది దుర్మరణం
అంతర్జాతీయం

హర్మూజ్‌ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్‌.. 14 మంది దుర్మరణం

హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న ప్రపంచ చమురు మార్కెట్ కీలక కేంద్రం ‘రాస్ తనూరా’లో సౌదీ అరామ్‌కోకు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది.

28, జూన్ 2026

ఏపీకి భారీ వర్ష సూచన
వాతావరణం

ఏపీకి భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో నేడు వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, అల్లూరి సీతారామ రాజు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసి, కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

22, జూన్ 2026

గల్ఫ్‌ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్‌ ఆస్తులపై అమెరికా దృష్టి
అంతర్జాతీయం

గల్ఫ్‌ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్‌ ఆస్తులపై అమెరికా దృష్టి

గల్ఫ్‌ యుద్ధంలో నష్టపోయిన మిత్ర దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్‌ ఆస్తులను వినియోగించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు సూచిస్తున్నాయి. ఇందుకోసం గల్ఫ్‌ దేశాల నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రత్యేక బృందాన్ని నియమించగా, ఇరాన్‌ స్తంభింపజేసిన నిధుల విడుదలపై తన డిమాండ్‌ కొనసాగిస్తుండటంతో ఈ ఆస్తుల వినియోగంపై నిర్ణయం ప్రాంతీయ శాంతి ప్రక్రియ, అమెరికా–ఇరాన్‌ సంబంధాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

7, జూన్ 2026

గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు: కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ తీవ్ర దాడులు
అంతర్జాతీయం

గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు: కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ తీవ్ర దాడులు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ జూన్ 6న కువైట్, బహ్రెయిన్‌లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరపగా, బహ్రెయిన్ వాటిని వైమానిక రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నట్లు తెలిపింది. హార్ముజ్ జలసంధిలో అమెరికా–ఇరాన్ చర్యలు, ఇస్రేల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం నేపథ్యంగా ఈ పరిణామాలు చోటుచేసుకోగా, చమురు మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters