మదనపల్లె:- అన్నమయ్య జిల్లాలో ZPTC, MPTC నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు జిల్లా SP శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ పరిశీలన కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కేంద్రాల వద్ద అధికారులు, అభ్యర్థులు నిర్భయంగా వారి విధులు నిర్వర్తించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. అనధికార వ్యక్తులు కేంద్రాల వద్ద గుమిగూడకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నామినేషన్ పరిశీలనకు సంబంధించి అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పించేలా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు.

ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కేంద్రంలో పోలీసు సిబ్బందిని మోహరించి, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. నామినేషన్ పరిశీలన సమయంలో ఎలాంటి గందరగోళం, వాగ్వివాదాలు, గుంపులుగా గుమిగూడే ప్రయత్నాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి, అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని పోలీసు అధికారులు తెలియజేశారు.

జిల్లా వ్యాప్తంగా నామినేషన్ పరిశీలన కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, గుంపుల నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమన్వయంతో అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగించే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రజలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని పాటించి, శాంతి భద్రతలకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.