రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రైల్వే కోడూరు : తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాల సమీపంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న లైన్మెన్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా దిగ్భ్రాంతి కలిగించింది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం, విద్యుత్ సరఫరా వ్యవస్థలో లోపం ఏర్పడడంతో లైన్ల మరమ్మతుల కోసం సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో లైన్మెన్ దినేష్ (32) విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మృతుడు కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. దినేష్‌కు రెండేళ్ల క్రితమే వివాహం జరిగినట్లు సహోద్యోగులు తెలిపారు. ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న సహోద్యోగులు, స్థానికులు దినేష్ మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహచరులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఘటనపై సంబంధిత విభాగం అధికారులు ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా ప్రమాణాలు పాటించబడాయా లేదా అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్, సిబ్బంది తరచూ ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో మరోసారి భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దినేష్ మృతితో సహోద్యోగుల్లో దిగ్భ్రాంతి నెలకొంది. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.













