రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: టీజీ20 లీగ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ జట్టు రెండో వికెట్‌ను కోల్పోయింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలర్ అఖిల్ రాథోడ్ వేసిన బంతిని ఆరోన్ జార్జ్ భారీ షాట్‌కు యత్నించగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న గణేశ్ గడుగు చేతికి బంతి నేరుగా చేరింది. 35 పరుగులు చేసిన ఆరోన్ ఔటవడంతో జట్టు స్కోరు 95 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.
12 ఓవర్లు పూర్తయ్యేసరికి రంగారెడ్డి రైజర్స్ స్కోరు 98/2గా ఉంది. క్రీజ్‌లో తనయ్ త్యాగరాజన్ 2 పరుగులతో, ఆదిత్య 7 పరుగులతో ఆడుతున్నారు.
ఇంతకుముందు రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న ఇదే మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు తొలి వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ అవనీశ్ 53 పరుగుల వద్ద ఔటయ్యాడు. స్పిన్నర్ షణ్ముఖ అశ్విన్ బౌలింగ్‌లో 7.2వ ఓవర్‌లో అవనీశ్ భారీ షాట్‌కు ప్రయత్నించగా, బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 72 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
8 ఓవర్లు ముగిసేసరికి రంగారెడ్డి రైజర్స్ స్కోరు 79/1గా నమోదైంది. ఆ సమయంలో క్రీజ్‌లో ఆదిత్య 1 పరుగుతో, ఆరోన్ 20 పరుగులతో ఉన్నారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆ జట్టు ఓపెనర్లు పరుగులు రాబట్టారు. ఆరోన్ 17, అవనీశ్ 22 పరుగులతో రాణించగా, 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది.
హైదరాబాద్ బౌలింగ్ ఫస్ట్
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తమ రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రంగారెడ్డి రైజర్స్‌ను ఈసారి ఢీకొంటోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌కు రెండు జట్ల తుది జట్లు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, అభిరథ్ రెడ్డి (కెప్టెన్), గణేశ్ గడుగు, సాయి వికాస్ రెడ్డి, అర్వింద్, ప్రణవ్ శర్మ, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, అఖిల్ రాథోడ్, యశ్వీర్ గౌడ్.
రంగారెడ్డి రైజర్స్: అమన్‌రావు ఆరవెల్లి, ఆరోన్ వర్గీస్, తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆలంకృత్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, రాకేశ్ నానావత్, అరుణ్ కుమార్, పున్నయ్య భువనగిరి, ఆర్యన్ కరియప్ప.







