రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌లోనే కొనసాగుతున్నారు. అక్కడ జరుగుతున్న ‘ది హండ్రెడ్ 2026’ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌ను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో MI లండన్ జట్టుకు మద్దతుగా రోహిత్ శర్మ లండన్‌లోని ఓవల్ స్టేడియానికి హాజరయ్యారు.
ఓవల్ స్టేడియంలో MI లండన్ జట్టు యజమాని నీతా అంబానీతో కలిసి రోహిత్ శర్మ మ్యాచ్‌ను ఆస్వాదించారు. స్టేడియానికి చేరుకున్న రోహిత్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్టేడియం వెలుపల ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. రోహిత్ స్టేడియానికి చేరుకున్న దృశ్యాలను MI లండన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా, సంబంధిత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మ్యాచ్ విషయానికి వస్తే, ‘ది హండ్రెడ్ 2026’ తొలి MI లండన్, సన్ రైజర్స్ లీడ్స్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ లీడ్స్ జట్టు 100 బంతులు పూర్తయ్యేలోపే 99 బంతుల్లోనే 143 పరుగులకే ఆలౌట్ అయింది.
MI లండన్ బౌలర్ రిచర్డ్ Gleeson 19 బంతుల్లో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ సామ్ కరన్ 2 వికెట్లు సాధించాడు. వారి బౌలింగ్ దాడి ముందు సన్ రైజర్స్ లీడ్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే సన్ రైజర్స్ లీడ్స్ 143 పరుగులకే ఆలౌట్ కావడంతో MI లండన్‌కు 144 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది.
లక్ష్య ఛేదనలో MI లండన్ ఆరంభంలోనే ఎదురుదెబ్బను ఎదుర్కొంది. 44 బంతుల్లో 51 పరుగులకే విల్ జాక్స్ , జేమ్స్ విన్స్ , జాసన్ రాయ్ వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ విఫలమైన నేపథ్యంలో జట్టుపై ఒత్తిడి పెరిగింది.
ఈ పరిస్థితిలో నికోలస్ పూరం , సామ్ కరన్ జోడీ అద్భుతంగా రాణించింది. ఇద్దరూ కలిసి కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను MI లండన్ వైపు మళ్లించారు. ఇది MI లండన్ తరఫున నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యంగా రికార్డుల్లో నిలిచింది.
నికోలస్ పూరం కేవలం 22 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ సామ్ కరన్ 39 బంతుల్లో 60 పరుగులు చేసి అవుట్ కాకుండా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ పార్ట్నర్‌షిప్‌తో MI లండన్ ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే, మొత్తం 84 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన నికోలస్ పూరం కు ‘ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ ’ అవార్డు లభించింది. పూరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో MI లండన్ ‘ది హండ్రెడ్ 2026’ సీజన్‌ను విజయంతో ప్రారంభించి, టోర్నమెంట్‌లో బలమైన సంకేతాలు పంపింది.






