సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్‌ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ జరిగింది. ఈ ప్రచారాన్ని అనిరుధ్‌ ఖండించారు. అయితే, తాజాగా వీరి వివాహం గురించి మరో వార్త బయటికొచ్చింది. 

అనిరుధ్‌, కావ్య మారన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు కూడా ఓకే చెప్పినట్లు తెలిపారు.‘‘అనిరుధ్ మృదు స్వభావి. నాకు తెలిసినంతవరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి ఆర్డినరీ గర్ల్‌ కాదు. అంత పెద్ద జట్టును (SRH) నిర్వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది. ఆమె తన తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాలను పుణికిపుచ్చుకుంది. అనిరుధ్, కావ్య మారన్ మంచి జంట’’ అని పేర్కొన్నారు.

కావ్య.. సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌ కుమార్తె. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో మైదానంలో తనదైన హావభావాలతో పాపులర్‌ అయ్యారు. కళానిధి మారన్‌ నిర్మించిన ‘జైలర్‌’, ‘బీస్ట్‌’, ‘రాయన్‌’ తదితర చిత్రాలకు అనిరుధ్‌ సంగీతం అందించారు.