బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జట్టుకు

72 articles

వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లకు వికెట్లు దొరకలేదు
క్రీడలు

వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లకు వికెట్లు దొరకలేదు

శ్రీలంక XIతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ తొలి రోజు భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. శ్రీలంక XI 363/8 స్కోరు చేసింది, ఇందులో ఓపెనర్లు నిషాన్ మదుష్క, రవిందు రసాంత, మధ్యవరుసలో సోనాల్ దినుష కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్పిన్ బౌలర్లు వికెట్లు తీసుకున్నా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, సారాంశ్ జైన్ వికెట్‌లేమితో ఆందోళన కలిగించారు, శుభ్‌మన్ గిల్ గాయం మరో సమస్యగా మారింది.

8, ఆగ 2026

వన్డే క్రికెట్‌ కొత్త మైలురాయి… 5000వ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం
క్రీడలు

వన్డే క్రికెట్‌ కొత్త మైలురాయి… 5000వ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం

వన్డే క్రికెట్‌ చరిత్రలో 5000వ మ్యాచ్‌గా నిలిచిన వన్డే ప్రపంచకప్‌ లీగ్‌–2లో స్కాట్లాండ్‌–కెనడా పోరులో స్కాట్లాండ్‌ 9 పరుగుల తేడాతో గెలిచింది. ఫిన్లే మెక్‌క్రీత్‌ 111 పరుగులతో స్కాట్లాండ్‌కు బలమైన స్కోరు అందించగా, కెనడా తరఫున యువరాజ్‌ సమ్రా 78 పరుగులతో పోరాడినా జట్టు 272 పరుగులకే ఆలౌటై లక్ష్యానికి చేరువలోనే ఆగిపోయింది.

8, ఆగ 2026

స్థానిక వన్‌డేలో అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ సంచలనం
క్రీడలు

స్థానిక వన్‌డేలో అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ సంచలనం

అమృత్‌సర్ తరఫున స్థానిక వన్‌డే డిస్ట్రిక్ట్ టోర్నీలో ఆడిన అభిషేక్ శర్మ, తరన్ తారన్ జట్టుపై 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లతో 233 పరుగులు చేసి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 533 పరుగుల భారీ స్కోరు సాధించగా, జింబాబ్వేతో ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్‌కు ఈ ప్రదర్శన ఫామ్ తిరిగి వచ్చిందనే సంకేతాలు ఇస్తూ, టీమిండియాలో స్థానం పటిష్టం చేసుకునే దిశగా కీలక మలుపుగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

3, ఆగ 2026

ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ రెండో వరుస విజయం
క్రీడలు

ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ రెండో వరుస విజయం

జాంబియాలో జరుగుతున్న Asian Legends League‌లో Indian Royals జట్టు Pakistan Panthers‌పై 2 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 168 పరుగుల లక్ష్యాన్ని రిషి ధావన్, సారుల్ కీలక ఇన్నింగ్స్‌లతో 17.4 ఓవర్లలో ఛేదించగా, శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్‌పై భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

3, ఆగ 2026

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళ జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళ జట్టు ప్రకటన

మహిళల ఆసియా కప్‌ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది.

2, ఆగ 2026

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు సెమీస్‌ ప్రవేశం
క్రీడలు

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు సెమీస్‌ ప్రవేశం

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిల జట్టు ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి చేరి పతక ఆశలను సజీవంగా ఉంచింది. ఆర్యవీర్‌, గుర్వీర్‌ విజయాలు కీలకంగా నిలవగా, సెమీస్‌లో అమెరికాను ఎదుర్కోనుంది. అయితే అమ్మాయిల జట్టు అమెరికాతో 1-2 తేడాతో ఓడి టోర్నీలో నుంచి నిష్క్రమించింది.

31, జులై 2026

దూలేప్ ట్రోఫీ 2026కు ఈస్ట్ జోన్ జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

దూలేప్ ట్రోఫీ 2026కు ఈస్ట్ జోన్ జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

దూలేప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహమ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, ముకేష్ కుమార్, షాబాజ్ అహ్మద్ వంటి ప్రముఖులు, యువ ప్రతిభావంతులతో కలిసి 15 మంది ప్రధాన జట్టు, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఎంపిక కావడంతో ఈస్ట్ జోన్ పోటీ సామర్థ్యం పెరిగిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

30, జులై 2026

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ
క్రీడలు

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ

బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. పాకిస్థాన్ సిరీస్ నుంచి జో రూట్ మళ్లీ టెస్ట్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంగ్లాండ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే స్టోక్స్ మాత్రం ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌కే టెస్ట్ సారథ్యం అప్పగించాలని భావిస్తున్నాడని సమాచారం.

25, జులై 2026

మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో రూప రాణి టిర్కీ
క్రీడలు

మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో రూప రాణి టిర్కీ

మహిళల పెయిర్స్‌ విభాగంలో రూప రాణి టిర్కీ–పింకి సింగ్‌ జంట తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మాల్టా జంట రెబెకా–కాని లీపై తొలి సెట్‌ను 7-1తో గెలిచిన భారత ద్వయం, రెండో సెట్‌ను కోల్పోయినా టైబ్రేక్‌లో దూకుడుగా ఆడి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. ఈ విజయం భారత మహిళల పెయిర్స్‌ జట్టుకు ఉత్తేజాన్ని అందించింది.

24, జులై 2026

ది ఉమెన్స్ హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఘన విజయం
క్రీడలు

ది ఉమెన్స్ హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఘన విజయం

లండన్‌లో జరిగిన ‘ది ఉమెన్స్ హండ్రెడ్ 2026’ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఉమెన్స్ జట్టు ఎమ్‌ఐ లండన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీప్తి శర్మ, డాని గిబ్సన్ బౌలింగ్‌తో లండన్‌ను 107 పరుగులకు పరిమితం చేయగా, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (43), అన్నాబెల్ సుథర్‌లాండ్ (30 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో 69 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి టోర్నీకి శుభారంభం చేసింది.

23, జులై 2026

టీమిండియా నిర్లక్ష్యంతో కౌంటీకి కుల్దీప్ యాదవ్.. యార్క్‌షైర్‌తో ఒప్పందం
క్రీడలు

టీమిండియా నిర్లక్ష్యంతో కౌంటీకి కుల్దీప్ యాదవ్.. యార్క్‌షైర్‌తో ఒప్పందం

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో Yorkshire తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. England వన్డే, Zimbabwe టీ20 సిరీస్‌లకు ఎంపిక కాకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్‌లో Metro Bank One Day Cup, County Championship కలిపి ఎనిమిది మ్యాచ్‌లు ఆడుతూ, Sri Lanka టెస్టుల సిరీస్‌కు ముందు తన రిథమ్‌ను కొనసాగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

23, జులై 2026

అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిదీ రాజీనామా
క్రికెట్

అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిదీ రాజీనామా

అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ వ్యక్తిగత కారణాలతో నాయకత్వ బాధ్యతలకు రాజీనామా చేసి, ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని వెల్లడించారు. 2022 నుంచి కెప్టెన్‌గా ఉన్న ఆయన సారథ్యంలో జట్టు 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొని ఇంగ్లాండ్ , పాకిస్తాన్ , శ్రీ లంక , నెథర్లాండ్స్ పై చారిత్రాత్మక విజయాలు సాధించింది. ఐర్లాండ్ తో వచ్చే వన్డే సిరీస్‌కు ముందు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్‌ను ప్రకటించనుంది.

22, జులై 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం అంగీకరించిన డేవిడ్ వార్నర్ ..
క్రీడలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం అంగీకరించిన డేవిడ్ వార్నర్ ..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ కోర్టులో నేరం అంగీకరించగా, శిక్ష ఖరారు కోసం ఆగస్టు 18 తేదీని Waverley లోకల్ కోర్ట్ నిర్ణయించింది. డేవిడ్ వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి చట్టబద్ధ పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువగా నమోదవడంతో, ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్, ముఖ్యంగా సిడ్నీ థండర్ కెప్టెన్సీ భవిష్యత్తుపై ప్రభావం ఏవుంటాయన్నదిపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

22, జులై 2026

ది హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో MI లండన్ విజయం
క్రికెట్

ది హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో MI లండన్ విజయం

ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ శర్మ అక్కడే కొనసాగుతూ, ‘ది హండ్రెడ్ 2026’ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌ను లండన్ ఓవల్‌లో MI లండన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరం, సామ్ కరన్ అజేయ భాగస్వామ్యంతో MI లండన్ సన్ రైజర్స్ లీడ్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి, నికోలస్ పూరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

22, జులై 2026

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌
క్రీడలు

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌

వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ నాలుగో వన్డేలో ఒక వికెట్‌ తేడాతో గెలిచి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చాప్‌మన్‌ 80, శాంట్నర్‌ 34 నాటౌట్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, బౌలింగ్‌లో ఫిషర్‌ 3 వికెట్లు, బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌ చెరో రెండు వికెట్లు తీసి వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.

21, జులై 2026

కడప–కర్నూలు జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు
జిల్లా వార్తలు

కడప–కర్నూలు జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు

కడప–కర్నూలు జట్ల మధ్య కేవోఆర్‌ఎం మైదానంలో జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. కడప బౌలర్లలో నాగ కుల్లాయప్ప 5 వికెట్లు, శివశంకర్‌ 4 వికెట్లు తీస్తే, కర్నూలు జట్టు 218 పరుగులకే ఆలౌట్‌ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కడప జట్టు ఒక వికెట్‌ కోల్పోయి 21 పరుగులు మాత్రమే చేయడంతో రెండో రోజు వారి బ్యాటింగ్‌ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది.

20, జులై 2026

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు సలీమా టెటె కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరిగే ఈ టోర్నమెంట్‌లో పోటీపడే 20 మంది సభ్యుల జట్టులో సీనియర్, జూనియర్‌ ఆటగాళ్లకు సమతూకంగా అవకాశం లభించగా, ఇదే బృందం సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ భారత తరఫున ఆడనుంది.

18, జులై 2026

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా

అట్లాంటాలో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఇంగ్లాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్లోకి చేరింది. 85వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్, 90+2 నిమిషంలో లాతరో మార్టినెజ్ గోల్స్‌తో అర్జెంటీనాకు విజయం లభించింది. ఇప్పుడు మెస్సి సారథ్యంలో నాలుగో టైటిల్‌ కోసం అర్జెంటీనా, రెండో కప్పు కోసం స్పెయిన్‌ ఫైనల్లో తలపడనుండటంతో ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానుల దృష్టి ఈ పోరుపై నిలిచింది.

16, జులై 2026

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు టీమ్‌ ఇండియా సిద్ధం
క్రీడలు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు టీమ్‌ ఇండియా సిద్ధం

ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు టీమ్‌ ఇండియా సిద్ధమైంది. టెస్టుల అనంతరం Rohit Sharma, Virat Kohli వన్డే జట్టులో చేరడంతో టాప్‌ ఆర్డర్‌ బలపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. Jasprit Bumrah నేతృత్వంలోని బౌలింగ్‌, Hardik Pandya, Ravindra Jadeja ఆల్‌రౌండ్‌ సామర్థ్యాలతో భారత్‌–ఇంగ్లాండ్‌ మధ్య తొలి వన్డే రసవత్తరంగా సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

13, జులై 2026

ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?
క్రీడలు

ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?

ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ ఎంపికలో రాహుల్‌ ద్రవిడ్‌ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఆండీ ప్లవర్‌, రిచర్డ్‌ డాసన్‌తో పాటు కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, మైక్‌ హసన్‌, జస్టిన్‌ లాంగర్‌ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ టెస్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకోగా, వైట్‌ బాల్‌ జట్లకు మాత్రం ఆయనే కోచ్‌గా కొనసాగనున్నారు.

13, జులై 2026

మొరాకోపై విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లోకి ఫ్రాన్స్‌
క్రీడలు

మొరాకోపై విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లోకి ఫ్రాన్స్‌

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ మొరాకోపై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఎంబాపె, డెంబెలె చెరో గోల్‌ నమోదు చేయగా, ఎంబాపె ఈ టోర్నీలో తన గోల్స్‌ను 8కు పెంచి మెస్సి సరసన నిలిచాడు. డాలస్‌లో జరగనున్న సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌ స్పెయిన్‌ లేదా బెల్జియం జట్టుతో తలపడనుండగా, వరుసగా మరోసారి టైటిల్‌ లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

10, జులై 2026

లక్ష్మణ్‌కి కోచింగ్‌ బాధ్యతలు?
క్రీడలు

లక్ష్మణ్‌కి కోచింగ్‌ బాధ్యతలు?

భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. అరుదైన రోగ నిరోధక సమస్యతో బాధపడుతున్న అఫ్గాన్‌ వెటరన్‌ పేసర్‌ షాపూర్‌ జద్రాన్‌ దిల్లీలో చికిత్స పొందుతూ 39వ పుట్టినరోజు ముందు రోజు మృతి చెందగా, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కామన్వెల్త్‌ క్రీడల కోసం 124 మంది అథ్లెట్లతో భారత బృందం గ్లాస్గోకు బయల్దేరగా, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

8, జులై 2026

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి
క్రీడలు

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ప్రిక్వార్టర్స్‌లో జూలై 6న మెక్సికో సిటీలోని ఎస్టాడియా అజ్టెకా మైదానంలో ఇంగ్లాండ్‌–మెక్సికో జట్లు తలపడనున్నాయి. సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో ఉండే ఈ మైదానంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆటగాళ్ల శారీరక సామర్థ్యంపై ప్రభావం పడకుండా చూడేందుకు, ఇంగ్లాండ్‌ మేనేజర్‌ థామష్‌ టచెల్‌ విజ్ఞప్తి మేరకు ఫిఫా అనుమతితో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి లభించింది.

4, జులై 2026

స్విట్జర్లాండ్‌కి 94 ఏళ్ల తర్వాత నాకౌట్‌ విజయం
క్రీడలు

స్విట్జర్లాండ్‌కి 94 ఏళ్ల తర్వాత నాకౌట్‌ విజయం

94 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో స్విట్జర్లాండ్‌ 2-0తో అల్జీరియాపై గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఎంబోలో, డాన్‌ ఎండోయ్‌ గోల్స్‌తో స్విస్‌ జట్టు ప్రిక్వార్టర్స్‌కు చేరుకుని, రాబోయే మంగళవారం కొలంబియా-ఘనా మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.

4, జులై 2026

ప్రీ క్వార్టర్స్‌కు కొలంబియా.. ఘనాపై ఘన విజయం
క్రీడలు

ప్రీ క్వార్టర్స్‌కు కొలంబియా.. ఘనాపై ఘన విజయం

ఫిఫా వరల్డ్ కప్‌-2026లో కొలంబియా జట్టు కీలక విజయం సాధించింది. కెన్సాస్ సిటీలోని ఆర్రోహెడ్ స్టేడియంలో శనివారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఘనాపై 1-0 గోల్స్‌ తేడాతో గెలిచి, రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది.

4, జులై 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఇంగ్లాండ్‌..
క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఇంగ్లాండ్‌..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో గెలిచి ఆతిథ్య ఇంగ్లాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది. బ్రంట్‌ 75, హెథర్‌ నైట్‌ 58 పరుగులతో ఇంగ్లాండ్‌ 169 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 129 పరుగులకే పరిమితమైంది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ ఆస్ట్రేలియాతో తలపడనుండగా, ఈ పోరుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

3, జులై 2026

ప్లేఆఫ్స్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దృష్టి
క్రికెట్

ప్లేఆఫ్స్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దృష్టి

టీ జీ20 లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బుధవారం హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ వరంగల్‌ వారియర్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌ స్థానం దాదాపు ఖాయం చేసుకునే అవకాశంలో ఉంది. కెప్టెన్‌ అభిరథ్‌ బ్యాటింగ్‌ ఫామ్‌, అజయ్ దేవ్ గౌడ్ , శ్రీనికేత్ , ప్రణవ్ వర్మ, షణ్ముఖ్ ల బౌలింగ్‌ జట్టుకు బలం కాగా, వరుస ఓటములతో దిగువన ఉన్న వరంగల్‌ వారియర్స్‌ ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని చూస్తోంది.

1, జులై 2026

ఎనిమిదోసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా మహిళలు
క్రీడలు

ఎనిమిదోసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా మహిళలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరింది. సోఫీ మోలనూ, ఆష్లీ గార్డ్‌నర్‌, జార్జియా వేర్‌హామ్‌ బౌలింగ్‌తో వెస్టిండీస్‌ 125 పరుగులకే పరిమితమై, ఛేజ్‌లో బెత్‌ మూనీ 61 నాటౌట్‌, ఆష్లీ గార్డ్‌నర్‌ 35 నాటౌట్‌తో ఆసీస్‌ 13 ఓవర్లలో లక్ష్యాన్ని సులభంగా అందుకుంది.

1, జులై 2026

ఏపీఎల్‌ ఫైనల్లో వైజాగ్‌ లయన్స్‌
క్రికెట్

ఏపీఎల్‌ ఫైనల్లో వైజాగ్‌ లయన్స్‌

మంగళగిరిలో జరిగిన క్వాలిఫయర్‌–2లో అమరావతి రాయల్స్‌పై 57 పరుగుల తేడాతో విజయం సాధించిన వైజాగ్‌ లయన్స్‌ ఏపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది. నిమ్మల హిమకర్‌ శతకంతో 243 పరుగుల భారీ స్కోరు చేసి, గిరినాథ్‌ రెడ్డి, శ్రీకాంత్‌, కమారుద్దీన్‌ బౌలింగ్‌తో అమరావతిని 186 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భీమవరం బుల్స్‌తో వైజాగ్‌ లయన్స్‌ మంగళవారం టైటిల్‌ కోసం తలపడనుంది.

30, జూన్ 2026

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు
క్రీడలు

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు

టీ20 ప్రపంచ కప్‌ 2026లో సెమీ ఫైనల్స్‌కు చేరుకోకపోయినా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు 2028 లోడ్ అంగెల్స్ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా జట్లలో ఉత్తమ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌కు ప్రత్యక్ష ప్రవేశం లభించగా ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , సౌత్ ఆఫ్రికా జట్లు కూడా అర్హత పొందాయి. ఈ అర్హతతో ఒలింపిక్‌ వేదికపై మెడల్‌ కోసం పోటీ పడే కీలక అవకాశం భారత జట్టుకు లభించింది.

30, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters