రాయలసీమ న్యూస్, గుడ్ న్యూస్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ భారతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను తక్కువ సమయంలో దర్శించుకునే అవకాశం కల్పిస్తూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రకటించింది. ‘ సౌత్ ఇండియా టెంపుల్ రన్ ’ పేరుతో లాంచ్ చేసిన ఈ టూర్ ద్వారా మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చి, త్రివేండ్రం పరిసరాల్లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. ,
మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. టికెట్ ధరలు రూ.37,700 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 16న ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరడంతో యాత్ర మొదలవుతుంది.
తొలి రోజు హైదరాబాద్ నుంచి త్రివేండ్రం చేరుకున్న తర్వాత యాత్రికులు ముందుగా కేటాయించిన హోటల్‌లో బస చేస్తారు. అల్పాహారం అనంతరం పూవర్ ఐలాండ్ , ఆజ్హిమాల శివ టెంపుల్ సందర్శన ఉంటుంది. అదే హోటల్‌లో రాత్రి భోజనం, బస సౌకర్యం కల్పిస్తారు.
రెండో రోజు తెల్లవారుజామున పద్మనాభస్వామి టెంపుల్ దర్శనం అనంతరం బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ చెక్ అవుట్ చేస్తారు. మధ్యాహ్నం కన్యాకుమారి చేరుకుని అక్కడ సన్సెట్ పాయింట్ సందర్శిస్తారు. కన్యాకుమారిలో కేటాయించిన హోటల్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
మూడో రోజు కన్యాకుమారి హోటల్‌లో అల్పాహారం అనంతరం చెక్ అవుట్ చేసి వివేకానంద రాక్ మెమోరియల్ , తిరువళ్ళువర్ స్తతుఎ దర్శనం ఉంటుంది. అనంతరం రామేశ్వరం చేరుకుని అక్కడి హోటల్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు.
నాలుగో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత రామేశ్వరం టెంపుల్ , ధనుష్కోడి ప్రాంతంలోని ఆలయాలను సందర్శిస్తారు. స్థానిక ఇతర ఆలయాల దర్శనానికి యాత్రికులు ప్రైవేట్ వాహనాలు అద్దెకు తీసుకుంటే, వాటి ఖర్చులు స్వయంగా భరించాలి. రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది.
ఐదో రోజు అల్పాహారం అనంతరం రామేశ్వరం హోటల్ చెక్ అవుట్ చేసి Dr. A.P.J. అబ్దుల్ కలం మెమోరియల్ సందర్శిస్తారు. అక్కడి నుంచి తంజావూర్ చేరుకుని బ్రిహదీశ్వర టెంపుల్ దర్శనం అనంతరం తిరుచిరప్పల్లి పయనమవుతారు. తిరుచ్చిలో కేటాయించిన హోటల్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
ఆరో రోజు తెల్లవారుజామున శ్రీరంగం టెంపుల్ దర్శనం అనంతరం బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ చెక్ అవుట్ చేస్తారు. తరువాత మదురై చేరుకుని హోటల్‌లో బస చేస్తారు. సాయంత్రం షాపింగ్ కోసం స్వేచ్ఛా సమయం కల్పిస్తారు. మదురైలోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.
ఏడో రోజు అల్పాహారం అనంతరం హోటల్ చెక్ అవుట్ చేసి మీనాక్షి టెంపుల్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మదురై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పయనమవుతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ఛార్జీల విషయానికి వస్తే, హోటల్‌లో సింగల్ ఆక్కుపెన్సీ(ఒక్కరికే గది)కి రూ.52,550, డబల్ ఆక్కుపెన్సీ కి రూ.39,850, ట్రిపుల్ ఆక్కుపెన్సీకి రూ.37,700గా నిర్ణయించారు. 5–11 ఏళ్ల పిల్లలకు ( విత్ బెడ్ ) రూ.33,000, 5–11 ఏళ్ల పిల్లలకు ( వితౌట్ బెడ్ ) రూ.28,700, 2–4 ఏళ్ల పిల్లలకు రూ.21,400 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్యాకేజీలో హైదరాబాద్ – తిరువనంతపురం , మదురై – హైదరాబాద్ మధ్య విమాన టికెట్లు, 7 అల్పాహారాలు, 5 రాత్రి భోజనాలు, పర్యటన మొత్తం కోసం AC Bus సౌకర్యం, ట్రావెల్ Insurance సదుపాయం భాగంగా ఉంటాయి.
ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం IRCTC tourism.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సంస్థ సూచిస్తోంది.





