మునిసిపల్ ఎన్నికల వేళ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరోజు పర్యటనలో భాగంగా నేడు పులివెందుల పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆయనను కలిసి ఇటీవల ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన తెలుగుదేశం పార్టీ వరదరాజుల రెడ్డి కుటుంబం దౌర్జన్యకాండ ఘటన వివరాలను తెలియజేశారు.

అంతకుముందు పులివెందుల నియోజకవర్గంలోని ప్రజలు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభలో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ప్రొద్దుటూరులో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ, పోలీసుల తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నింటినీ గుర్తుంచుకుని తగిన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతామని హెచ్చరించారు.

నవంబర్ 1న జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటరు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త, అభిమాని కృషి చేయాలని ఆయన కోరారు.

పులివెందుల పర్యటనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డితో పాటు ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్మన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి, పులివెందుల నియోజకవర్గ పరిశీలకులు కల్లూరు నాగేంద్ర రెడ్డి, ప్రొద్దుటూరు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పోరెడ్డి సందీప్ రెడ్డి పాల్గొన్నారు.