రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం ఉభయ సభల సమావేశాల షెడ్యూల్‌ను రిజిజు ప్రకటించారు.
ఈ సమావేశాల్లో దేశ ప్రాధాన్య అంశాలపై విస్తృత చర్చలు, చట్టాలపై పరిశీలన, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కిరణ్ రిజిజు పేర్కొన్నారు. 'జాతీయ ప్రయోజన సంబంధిత అంశాలపై అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులు జరగాలి' అని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.







