రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: హీరో రామ్ పోతినేని తొలిసారిగా దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కా ప్రణాళికతో, కట్టుదిట్టమైన బడ్జెట్ పరిమితుల్లోనే పూర్తి చేయాలని రామ్ ముందుగానే నిర్ణయించుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణ వ్యయాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవడమే లక్ష్యంగా ఆయన ప్రతి అడుగూ వేస్తున్నాడని సమాచారం.
ఈ క్రమంలో రామ్ తన దర్శకత్వ చిత్రానికి తాను ప్రత్యేకంగా రెమ్యునరేషన్ తీసుకోకుండా, లాభాల్లో వాటా రూపంలోనే పారితోషికం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలిసింది. అయితే నటీనటుల రెమ్యునరేషన్ విషయంలో మాత్రం చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాలో కీలక పాత్రల కోసం యూనిట్ పలు ప్రముఖ నటీనటులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విలక్షణ నటుడు ఎస్.జె. సూర్యను ఒక పవర్ఫుల్ పాత్ర కోసం అప్రోచ్ చేయగా, ఆయన పారితోషికం మేకర్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం. ఎస్.జె. సూర్య ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్లో చర్చ నడుస్తోంది.
అలాగే హీరోయిన్గా కేజీఎఫ్ ఖ్యాతి గల శ్రీనిధి శెట్టిని తీసుకోవాలని యూనిట్ మొదట భావించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె కూడా ఈ చిత్రానికి కోటిన్నర రూపాయల పారితోషికం కోరినట్లు టాక్. ఈ రెమ్యునరేషన్లు సినిమా కోసం ముందుగా నిర్ణయించిన బడ్జెట్‌ను గణనీయంగా మించిపోవడంతో, అంత భారీ మొత్తాన్ని చెల్లించడం కంటే వేరే నటీనటులను ఎంపిక చేసుకోవడమే ఉత్తమమని రామ్ భావిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఇప్పుడు ఆ కీలక పాత్రల కోసం ప్రత్యామ్నాయ కాస్టింగ్ ఆప్షన్లను పరిశీలించే పనిలో యూనిట్ నిమగ్నమైనట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి స్థానంలో టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహార్ పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నారని, ప్రస్తుతం ఆమెతో చర్చలు కొనసాగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ కయాదు డేట్స్ కుదరకపోతే, లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్‌ను మరో ఆప్షన్‌గా యూనిట్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక నటీనటుల జాబితా, స్టార్ కాస్టింగ్ వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం బడ్జెట్ పరిమితులు, రెమ్యునరేషన్ లెక్కలు, కాస్టింగ్ సమీకరణలతో ఈ చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.







