రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పంపిణీ పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. మంగళవారం స్థానిక 06వ వార్డు సచివాలయం పరిధిలోని డ్రైవర్ కొట్టాల ప్రాంతంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేసి, లబ్ధిదారులతో మాట్లాడారు.
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
కార్యక్రమం సందర్భంగా కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా సాగాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు బట్వాడా చేయాలని, పింఛన్ అందించే సిబ్బంది లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులో దివ్యాంగులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, తలసీమియా వ్యాధిగ్రస్తులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, కిడ్నీ, లివర్ వ్యాధిగ్రస్తులు తదితరులకు కలిపి మొత్తం 20 రకాల సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నట్లు కమీషనర్ వివరించారు. ఈ పింఛన్ల ద్వారా సుమారు 14,094 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.6 కోట్ల 21 లక్షల నగదు పంపిణీ జరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రొద్దుటూరులో 20 రకాల సామాజిక భద్రత పింఛన్లు సుమారు 14094 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ 6 కోట్లా 21 లక్షలు నగదు పంపిణి చేస్తున్నాం.
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించేందుకు, అలాగే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల వరకు చేరవేయడానికి ప్రొద్దుటూరు పురపాలక సంఘం కృషి చేస్తోందని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా కమీషనర్ దివ్యాంగులైన మహబూబు, సుబ్బారాయుడు లకు పింఛన్ నగదు స్వయంగా అందజేశారు. అనంతరం వారి యోగక్షేమాలు, పింఛన్ అందుబాటులోకి రావడం వల్ల కలిగిన ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.














