రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు గాను ప్రముఖ MongoDB సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి తెలిపారు. ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (SRIT), బెంగళూరుకు చెందిన MongoDB సంస్థల మధ్య ICT అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఈ మెమొరాండం అఫ్ అండర్స్టాండింగ్ (MoU) జరిగింది.
కాలేజీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సర్టిఫికేట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు, కరికులమ్ కార్యకలాపాలు, పరిశోధన–అభివృద్ధి, పరిశోధనా ప్రచురణలు, అలాగే ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందుబాటులోకి రానున్నాయి. పరిశ్రమలలో తాజా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడనున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో SRIT వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, MBA HOD డాక్టర్ షబానాభి, ICT అకాడమీ AP స్టేట్ హెడ్ దినకర్ రెడ్డి, అసోసియేటెడ్ వైస్ ప్రెసిడెంట్ జి. శరవన్, అకాడమీ పార్టనర్ షిప్ మేనేజర్ ఇండియా బసవ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీ, సంస్థల ప్రతినిధుల సమక్షంలో MoUపై సంతకాలు జరిగాయి.
ఈ అవగాహన ఒప్పందంతో విద్యార్థులు అకాడమిక్ స్థాయిలోనే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సాధించే అవకాశం లభిస్తుందని కాలేజీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా డేటాబేస్ టెక్నాలజీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో MongoDB సహకారంతో శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ MoUతో విద్యార్థులకు మెరుగైన విద్య, పరిశ్రమల అనుభవం కల్పించే అద్భుత అవకాశం ఏర్పడిందని కాలేజీ చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీర కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ బసిరెడ్డి వీర కళ్యాణ్ రెడ్డి, వివిధ విభాగాల HODలు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా కాలేజీ, పరిశ్రమల మధ్య అనుసంధానం మరింత బలపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.













