వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో, జైలు నిబంధనల ప్రకారం అధికారులు అనుమతి ఇవ్వలేదు.

సాయంత్రం 5 గంటల తర్వాత సీదిరి అప్పలరాజును కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరారు. ఈ విషయంపై జైలర్‌.. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపగా, జైలు నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటలలోపే ములాఖత్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. దీంతో జగన్‌–అప్పలరాజు ములాఖత్‌కు అనుమతి లభించలేదు.

కాగా, సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు 2026 జులై 22 సాయంత్రం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడి ప్రమేయాన్ని కప్పిపుచ్చడానికి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నారు.