కదిరి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్. మక్బూల్ పాల్గొన్నారు. యువత, విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో భాగంగా డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదని మక్బూల్ ఆరోపించారు. గతంలో Y.S. జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తండ్రి, దివంగత నేత Y.S. రాజాశేఖర్ రెడ్డి స్వయంగా CBI విచారణను ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం సాక్ష్యాధారాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా లోకేష్‌ను తెలుగు దేశం పార్టీ అధినేత N. చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు వారు పదవులకు రాజీనామా చేసినట్లే, నారా లోకేష్ కూడా నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలని మక్బూల్ అభిప్రాయపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై పదవతేది ర్యాలీ నిర్వహించడం ద్వారా సమస్యలు తెరమరుగవుతాయని భావించడం మూర్ఖత్వమని ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మక్బూల్ గారు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై, DSC–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం..

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న యువత, విద్యార్థులు డీఎస్సీ–2025 నియామకాలలో పారదర్శకత లేకపోవడం, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కదిరి ప్రాంతంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ద్వారా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని మక్బూల్ సహా పాల్గొన్న నాయకులు అభ్యర్థిస్తున్నారు.