రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: టీ జీ20 లీగ్‌లో ఓటమి తెలియకుండా దూసుకుపోతున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుపై గురి పెట్టింది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఈ జట్టు, బుధవారం వరంగల్ వారియర్స్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్ స్థానం దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉంది.
ఫామ్ పరంగా చూస్తే హైదరాబాద్ మరో విజయానికి సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఆ జట్టుకు ప్రధాన బలం కెప్టెన్ అభిరథ్. ఇప్పటివరకు 35, 99, 59, 59 పరుగులతో మొత్తం 252 పరుగులు సాధించిన అభిరథ్ ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. మూడో మ్యాచ్‌లో ఫామ్ అందుకుని 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మరో ఓపెనర్ సాయి వికాస్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే అతడు తిరిగి ఫామ్ అందుకుంటాడన్న ఆశ జట్టులో ఉంది.
మిడిలార్డర్లో అన్విత్ రెడ్డి నిలకడగా పరుగులు రాబడుతూ జట్టుకు బలాన్నిస్తోంది. గణేశ్ గడుగు దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. చివరి మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ బంతితోనూ సత్తా చాటడం హైదరాబాద్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం కల్పించింది.
బౌలింగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. పేసర్ అజయ్ దేవ్ గౌడ్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన శ్రీనికేత్ లయ అందుకున్నాడు. ప్రణవ్ వర్మ, షణ్ముఖలతో కూడిన స్పిన్ విభాగం కూడా ప్రభావవంతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది.
మరోవైపు వరంగల్ వారియర్స్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ఈ జట్టు పట్టికలో దిగువన ఉంది. ఈ నేపథ్యంలో విజయంతో పుంజుకోవాలని వరంగల్ చూస్తోంది. హైదరాబాద్‌పై విజయం సాధిస్తే టోర్నీలో తమ ప్రయాణాన్ని తిరిగి పటిష్టం చేసుకునే అవకాశం వరంగల్‌కు లభిస్తుంది.
బుధవారం మరో మ్యాచ్‌లో నల్గొండ, ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో విజయం సాధించే జట్టు ప్లేఆఫ్స్ రేసులో తమ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. టీ జీ20 లీగ్‌లో కీలక దశకు చేరుకున్న ఈ పోటీలు, రాబోయే రోజుల్లో ప్లేఆఫ్స్ చిత్రాన్ని స్పష్టంగా చూపే అవకాశం ఉంది.
అజయ్ దేవ్ గౌడ్ , శ్రీనికేత్ , ప్రణవ్ వర్మ, షణ్ముఖ్







