వైద్య పరీక్షల నిమిత్తం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముంబయి చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి పవన్‌ వెళ్లనున్నారు. పవన్‌కల్యాణ్‌ వెంట ఆయన సతీమణి అన్నా కొణిదెల ఉన్నారు.