ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్

తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ నెలకొన్న వివాదం కొనసాగుతోంది. “మీ అయ్య జాగీరా” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ తమ “అయ్య జాగీరు” కాదంటూ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రతిస్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో సెటైర్లు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, జనసేన, తెలంగాణ పేర్లు ప్రస్తావించకపోయినా, ఆ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. తెలంగాణలో పోటీ చేస్తామన్న పవన్ కళ్యాణ్ ప్రకటనపై ఇది సెటైరికల్ ట్వీట్‌గా కనిపిస్తోందని సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనకే ఈ ట్వీట్ ఉద్దేశించిందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అనుకూల వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు ప్రతిస్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి, రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. రాజకీయమంటే నటన కాదని, రోజుకో వేషం మార్చుకునే వేదిక కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి ఎవరూ ఒంటరిగా రారని, ప్రజల మద్దతు, పొత్తుల ఆధారంగానే ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు.

అని విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్లతో పవన్ కళ్యాణ్, జనసేన, తెలంగాణ రాజకీయాలపై ఆన్‌లైన్ వేదికల్లో చర్చ మరింత వేడెక్కింది.