రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తు, ఫామ్‌పై చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌కు మద్దతుగా మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ముందుకు వచ్చారు. రోహిత్ పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియా వేదిక Xలో ఓ పోస్టు చేశారు.
రోహిత్ వైఫల్యాన్ని చాలామంది ఆశిస్తున్నారన్న భావనపై కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్ ఇటీవల చూపుతున్న ఆటతీరు, జట్టుకు అందిస్తున్న సేవలను గుర్తుచేశారు. రోహిత్ ను కేవలం కొన్ని స్వల్ప స్కోర్ల ఆధారంగా విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అని కైఫ్ తన పోస్టులో పేర్కొన్నారు. రోహిత్ , విరాట్ కోహ్లీ ల అనుభవం రాబోయే పెద్ద టోర్నీల్లో భారత్‌కు కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో రోహిత్ ఓపెనింగ్ పాత్రపై కెప్టెన్ శుబ్మం గిల్ స్పందించారు. ఆఫ్గనిస్తాన్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గిల్ , జట్టులో ఓపెనింగ్ కాంబినేషన్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటే, గిల్ తో పాటు ఓపెనర్‌గా రోహిత్ లేదా యశస్వి జైస్వాల్ లో ఎవరు ఉంటారన్న ప్రశ్నపై ఆయన అభిప్రాయం వెల్లడించారు.
అని శుబ్మం గిల్ వ్యాఖ్యానించారు.
ఒకవైపు రోహిత్ పై విమర్శలు, మరోవైపు మాజీ, ప్రస్తుత క్రికెటర్ల మద్దతు మధ్య టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు కొనసాగుతున్నాయి. అనుభవజ్ఞులైన రోహిత్ , విరాట్ లతో పాటు గిల్ , జైస్వాల్ వంటి యువ ఆటగాళ్ల ఫామ్ ఎలా ఉండబోతుందన్నదే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.







