రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’కు 20 మంది
హైదరాబాద్: తెలంగాణలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) ప్రారంభించిన TG20 క్రికెట్ లీగ్‌లో కీలకమైన ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తైంది. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ఈ ఆక్షన్‌లో లీగ్‌లో భాగమైన ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ తమ జట్ల అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.
ఉషోదయ ఎంట్రప్రెస్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Ramoji Group)కు చెందిన ‘ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ’ జట్టు ఇప్పటివరకు మొత్తం రూ.58.95 లక్షలు వెచ్చించి 20 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. ఈ జట్టులో ఆల్‌రౌండర్ అజైదేవ్ గౌడ్ , బ్యాటర్ అభిరత్ రెడ్డి లకు అత్యధిక ధర లభించింది. ఇద్దరినీ చెరో రూ.11 లక్షలకు కొనుగోలు చేశారు.
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ పూర్తి సభ్యుల జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. అజైదేవ్ గౌడ్ (రూ.11 లక్షలు), అభిరత్ రెడ్డి మందాడి (రూ.11 లక్షలు), ప్రణవ్ వర్మ (రూ.8.5 లక్షలు), సాయి వికాస్ రెడ్డి (రూ.4.25 లక్షలు), అన్విత రెడ్డి (రూ.3.5 లక్షలు), గణేష్ గొడుగు (రూ.3.25 లక్షలు), యాశ్వీర్ గౌడ్ (రూ.3 లక్షలు), శ్రీనికేత్ (రూ.2.3 లక్షలు), అఖిల్ రాథోడ్ (రూ.1.6 లక్షలు), తరుణ్ రాజన్ (రూ.1.6 లక్షలు), షణ్ముఖ్ అశ్విన్ (రూ.1.5 లక్షలు), పీ. అరవింద్ (రూ.1 లక్ష), C. అభినవ్ తేజ్ (రూ.1 లక్ష), ప్రేమ్ చరణ్ (రూ.95 వేల రూపాయలు), గుడెల్లి జశ్వంత్ (రూ.75 వేల రూపాయలు), వైష్ణవ రెడ్డి (రూ.75 వేల రూపాయలు), నితిన్ నైక్ (రూ.75 వేల రూపాయలు), M. M. చరణ్ (రూ.75 వేల రూపాయలు), దేవ్ మెహతా (రూ.75 వేల రూపాయలు), మిర్యాల ప్రత్యుష కుమార్ (రూ.75 వేల రూపాయలు).
TG20 లీగ్‌లో ప్రతి ఫ్రాంఛైజీ తమ బడ్జెట్ పరిమితుల్లోనే కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకునేలా HCA ప్రత్యేకంగా వేలం విధానాన్ని రూపొందించింది. రాబోయే రోజుల్లో లీగ్‌లో పాల్గొనే ఇతర జట్ల తుది జాబితాలను కూడా నిర్వాహకులు ప్రకటించనున్నారు. TG20 లీగ్‌లో ఏ ఫ్రాంఛైజీ ఎవరెవరిని ఎంత మొత్తానికి దక్కించుకుందనే పూర్తి వివరాలను HCA విడిగా విడుదల చేయనుంది.
యువ క్రికెటర్లకు వేదికగా నిలిచే ఈ లీగ్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం, దేశానికి ప్రతిభావంతులైన ఆటగాళ్లు లభిస్తారనే నమ్మకాన్ని HCA వ్యక్తం చేస్తోంది. రానున్న సీజన్‌లో TG20 లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.







