ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌లో ఆయన్ను అధికారులు అరెస్ట్‌ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. నగరంలోని కారుమూరి నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించి వివిధ పత్రాలను పరిశీలించారు. ఇదే కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కారుమూరి సునీల్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.