రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
చిలీతో వార్మప్ మ్యాచ్‌లో రాఫెల్ లియావోకు రెడ్ కార్డు
2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్న పోర్చుగల్ జట్టుకు అనూహ్యంగా పెద్ద దెబ్బ తగిలింది. చిలి తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోనే తీవ్ర ఘర్షణకు దిగడంతో పోర్చుగల్ స్టార్ వింగర్ రఫెల్ లీవ్ కు రెడ్ కార్డు పడింది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ తొలిార్థం ఇంజరీ టైమ్‌లో ఈ ఉద్రిక్తత చెలరేగింది. పోర్చుగల్ ఆటగాడు జోలో కాన్సులో , చిలి డిఫెండర్ ఫిలిప్ ఫాండ్జ్ మధ్య చిన్నపాటి తోపులాట మొదలైంది. మొదట ఇద్దరి మధ్య వాగ్వాదంగా ప్రారంభమైన ఈ సంఘటన, ఇరు జట్ల ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా పెద్ద గొడవగా మారింది.
ఈ గందరగోళంలో చిలి ఆటగాడు ఇవాన్ రోమన్ , పోర్చుగల్ వింగర్ రఫెల్ లీవ్ ఒకరినొకరు బలంగా తోసుకుంటూ, కొట్టుకునే స్థాయికి వెళ్లారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రెఫరీ వెంటనే రంగంలోకి దిగి, ఇద్దరికీ నేరుగా రెడ్ కార్డు చూపించాడు. దీంతో లీవ్ , రోమన్ ఇద్దరూ మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
ఈ రెడ్ కార్డు కారణంగా పోర్చుగల్ జట్టులో ఆందోళన నెలకొంది. AC మిలన్ ఫార్వర్డ్ అయిన రఫెల్ లీవ్ పై ఫిఫా లేదా సంబంధిత అధికార సంస్థలు క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటాయేమోనని పోర్చుగల్ క్యాంప్‌లో టెన్షన్ కనిపిస్తోంది. ఒకవేళ అధికారిక నిషేధం విధిస్తే, వరల్డ్ కప్ ప్రారంభ దశలో పోర్చుగల్ ఆడే కొన్ని మ్యాచ్‌లకు లీవ్ దూరం కావాల్సి వచ్చే అవకాశం ఉందని ఫుట్‌బాల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లీవ్ బయటకు వెళ్లడంతో పోర్చుగల్ జట్టు మిగతా సమయం 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ రెండోార్థంలో పోర్చుగల్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన గొంకలో గుడ్స్ తొలి గోల్‌తో డెడ్‌లాక్‌ను చెరిపాడు. ఆ తర్వాత స్టార్ మిడ్‌ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండెస్ రెండో గోల్ నమోదు చేసి పోర్చుగల్ ఆధిక్యాన్ని మరింత బలపరిచాడు. మ్యాచ్ చివర్లో చిలి తరఫున లూకాస్ సెపెడ ఒక గోల్ చేసి తేడాను తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే పోర్చుగల్ రక్షణను పూర్తిగా దాటడంలో చిలి విఫలమైంది. చివరికి పోర్చుగల్ 2–1 తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్ ముందు జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, రఫెల్ లీవ్ పై ఉండే సంభావ్య నిషేధం పోర్చుగల్ జట్టుకు తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.







