బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మొదలైంది

24 articles

‘రామాయణం’లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదన్న సందేహానికి రణబీర్ కపూర్ క్లారిటీ
సినిమా

‘రామాయణం’లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదన్న సందేహానికి రణబీర్ కపూర్ క్లారిటీ

నితేష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణం’ ట్రైలర్‌లో హనుమంతుడు కనిపించకపోవడంపై వచ్చిన సందేహాలకు రణబీర్ కపూర్ స్పష్టత ఇచ్చారు. కథ మొదటి భాగం సీతాపహరణం వరకు మాత్రమే సాగుతుందని, వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడి ప్రవేశం రెండో భాగంలోనే ఉండటంతో సన్నీ డియోల్ పాత్రను అక్కడ గ్రాండ్‌గా చూపించబోతున్నట్లు తెలిపారు. కథ సారాన్ని మార్చకుండా, ఆధునిక విజువల్ టెక్నాలజీతో రెండు భాగాల్లో చెప్పేందుకు బృందం కృషి చేసిందని రణబీర్ పేర్కొనగా, సన్నీ డియోల్ లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

5, ఆగ 2026

సినిమా టికెట్‌ ధరలు, రెవెన్యూ పంపిణీపై కొత్త కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌
సినిమా

సినిమా టికెట్‌ ధరలు, రెవెన్యూ పంపిణీపై కొత్త కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో రెవెన్యూ పంపిణీ శాతం విధానంపై సమగ్ర అధ్యయనం చేసి సిఫార్సులు ఇవ్వడానికి పాత కమిటీని రద్దు చేసి, నిర్మాత కె.ఎల్. నారాయణ అధ్యక్షత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను సేకరించి దీర్ఘకాలిక పరిష్కార మార్గదర్శకాలు రూపొందించే బాధ్యత ఈ కమిటీదే కాగా, నివేదిక సమర్పణకు గడువు విధించలేదని సమాచారం.

5, ఆగ 2026

దీపావళి బరిలో ‘సూర్య47’..?
సినిమా

దీపావళి బరిలో ‘సూర్య47’..?

తమిళ స్టార్ సూర్య నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సూర్య47’ షూటింగ్ పూర్తయ్యింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో సూర్య ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో 48వ చిత్రంతో వరుస ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు.

30, జులై 2026

సన్‌రైజ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరింపు కేసు: ఐదుగురు అరెస్ట్
జిల్లా వార్తలు

సన్‌రైజ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరింపు కేసు: ఐదుగురు అరెస్ట్

కడప తాలూకాలోని సన్‌రైజ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని కత్తితో బెదిరించిన కేసులో విద్యార్థి సంఘాల నాయకులు, యూట్యూబర్లతో కలిసి మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ నిర్వహణపై కొనసాగుతున్న వివాదం, సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనతో విద్యాసంస్థల భద్రత, ఆన్‌లైన్ కార్యకలాపాల ప్రభావంపై చర్చ మొదలైందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

28, జులై 2026

షూటింగ్‌లో గాయపడ్డ రామ్ చరణ్‌కు
సినిమా

షూటింగ్‌లో గాయపడ్డ రామ్ చరణ్‌కు

‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయపడిన రామ్ చరణ్, జూలై 27న కోయంబత్తూరులో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఆపరేషన్ తర్వాత కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించగా, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న RC17 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

27, జులై 2026

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ
జాతీయం

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది.

24, జులై 2026

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం
జాతీయం

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ప్రాణాంతకంగా మారింది. చీర కొనివ్వలేదన్న కారణంతో ప్రారంభమైన వాగ్వాదం, భర్త హత్యకు దారి తీసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

23, జులై 2026

‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్‌పై హాట్ డిబేట్
సినిమా

‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్‌పై హాట్ డిబేట్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ ప్రమోషనల్ కంటెంట్‌లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై వోల్టేజ్ యాక్షన్ ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కియారా అద్వానీ, తారా సుతారియా తదితర హీరోయిన్లపై వరుసగా వస్తున్న రొమాంటిక్ పాటలు కథకు ఎంతవరకు ఉపయోగపడతాయనే ప్రశ్నల మధ్య, ఆగస్టు 26న విడుదలైన తర్వాతే సినిమా అసలు స్వరూపం తెలిసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

23, జులై 2026

బద్వేల్‌లో రోడ్డు ప్రమాదం.. రహదారి దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న ఘటన కలకలం
జిల్లా వార్తలు

బద్వేల్‌లో రోడ్డు ప్రమాదం.. రహదారి దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న ఘటన కలకలం

బద్వేల్‌లో ప్రధాన రహదారిపై రహదారి దాటుతున్న వృద్ధుడిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ ప్రమాదంతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, పాదచారుల భద్రత, జీబ్రా క్రాసింగ్‌లు, స్పీడ్ బ్రేకర్లు వంటి రహదారి భద్రతా ఏర్పాట్ల అవసరంపై ప్రజల్లో చర్చ, ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయని వారు అంటున్నారు.

22, జులై 2026

‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం: సెట్స్‌లో చేరిన తమన్నా భాటియా
సినిమా

‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం: సెట్స్‌లో చేరిన తమన్నా భాటియా

ప్రముఖ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రాగిణి’ మూడో భాగం ‘రాగిణి 3’ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. దర్శకుడు శశాంక ఘోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తుండగా, ఆమెతో పాటు ఆయుష్ శర్మ , జునైద్ ఖాన్ , నర్గిస్ ఫాఖ్రి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ , టిప్స్ ఫిలిమ్స్ , జై హోం మీడియా వెంచర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌పై బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

16, జులై 2026

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..
అంతర్జాతీయం

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు.

13, జులై 2026

ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?
క్రీడలు

ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?

ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ ఎంపికలో రాహుల్‌ ద్రవిడ్‌ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఆండీ ప్లవర్‌, రిచర్డ్‌ డాసన్‌తో పాటు కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, మైక్‌ హసన్‌, జస్టిన్‌ లాంగర్‌ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ టెస్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకోగా, వైట్‌ బాల్‌ జట్లకు మాత్రం ఆయనే కోచ్‌గా కొనసాగనున్నారు.

13, జులై 2026

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ
రాజకీయాలు

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ

వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.

8, జులై 2026

అనంతపురంలో దొంగ నోట్ల తయారీ
జిల్లా వార్తలు

అనంతపురంలో దొంగ నోట్ల తయారీ

అనంతపురంలో దొంగ నోట్ల తయారీ కేంద్రాన్ని విజయవాడ పోలీసులు గుర్తించి, నిందితులు రాజు, సురేష్‌ను అరెస్ట్ చేసి ముద్రణా యంత్రాలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆర్థిక లావాదేవీలపై ఆందోళన వ్యక్తమవుతుండగా, దొంగ నోట్ల నెట్‌వర్క్‌ను బహిర్గతం చేయడానికి దర్యాప్తు కొనసాగిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

3, జులై 2026

సర్‌ తతంగం తికమక
జిల్లా వార్తలు

సర్‌ తతంగం తికమక

అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం ప్రారంభమై పదిరోజులు గడిచినా గందరగోళం కొనసాగుతోంది. ఈఎఫ్‌ ఫారాల పంపిణీ, భర్తీ, స్వీకరణలో అయోమయం, పట్టణాల్లో తక్కువ పురోగతి, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల లోపం కారణంగా ఓటర్లలో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. మొత్తం 20.38 లక్షల ఓటర్లలో పంపిణీ చేసిన 19.45 లక్షల ఫారాల్లో ఇప్పటివరకు 1.81 లక్షల ఫారాలు మాత్రమే తిరిగి స్వీకరించబడటం సర్‌ అమలులో ఉన్న తికమకను స్పష్టంగా చూపిస్తోంది.

28, జూన్ 2026

సిఎన్జీ vs ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు: తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్ ?
బిజినెస్

సిఎన్జీ vs ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు: తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్ ?

పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతానికి కిలోమీటరుకు ప్రయాణ ఖర్చు, మైలేజ్ పరంగా చూస్తే CNG కార్లు వినియోగదారులకు ఎక్కువ లాభదాయకంగా, విస్తృతంగా లభ్యమవుతున్నాయి. అయితే దేశీయ ఇథనాల్ వినియోగం, ఇంధన భద్రత దృష్ట్యా ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీకి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

21, జూన్ 2026

పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. మొదలైన సందడి !
ఆంధ్రప్రదేశ్

పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. మొదలైన సందడి !

తెలుగు ఇళ్లల్లో పెళ్లి బాజాల సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా అధిక జ్యేష్ఠ మాసాల వల్ల ఆగిపోయిన శుభకార్యాల హడావుడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. జూన్ 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించడంతో పెళ్లిళ్ల హడావుడి షురూ అయ్యింది. అయితే, ఈ సంతోషాల వెనుక పెళ్లి పెద్దలకు ఒక పెద్ద బడ్జెట్ సవాల్ ఎదురవుతోంది.

17, జూన్ 2026

ఐపీఓ సందడి మళ్లీ మొదలైంది
ఎకానమీ

ఐపీఓ సందడి మళ్లీ మొదలైంది

ఈ ఏడాది అంతర్జాతీయ అనిశ్చితులు, చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనతలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ గణనీయంగా తగ్గి ఇప్పటివరకు కేవలం 3.5 బిలియన్‌ డాలర్ల వద్దే నిలిచింది. అయితే రాబోయే రెండు నెలల్లో ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌, వారీ ఎనర్జీస్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, LIC, హిందుస్థాన్‌ జింక్‌, జెప్టో, NSE తదితర సంస్థల ఇష్యూలతో సుమారు రూ.60,000 కోట్లకు పైగా నిధుల సమీకరణకు అవకాశం ఉండగా, అదే సమయంలో లాక్‌-ఇన్‌ ముగియడంతో భారీగా షేర్ల సరఫరా పెరగబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

14, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధం
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధం

ఇంగ్లాండ్‌లో శుక్రవారం నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతోంది. భారత్‌ సహా 12 జట్లు రెండు గ్రూపులుగా పోటీపడగా, న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌. వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు, ఈసారి టీ20 టైటిల్‌ సాధించి రెండు ఫార్మాట్లలోనూ కప్‌ దక్కించుకునే రెండో జట్టుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

10, జూన్ 2026

భర్త గల్లంతు.. 20 ఏళ్లుగా న్యాయం కోసం భార్య పరితపన
జిల్లా వార్తలు

భర్త గల్లంతు.. 20 ఏళ్లుగా న్యాయం కోసం భార్య పరితపన

అన్నమయ్య జిల్లా పీజీఆర్‌ఎస్‌ సమావేశంలో చంద్రకళ అనే మహిళ తన భర్త దేవరాజ్‌ 2006లో గల్లంతైనప్పటి నుంచి 20 ఏళ్లుగా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నానని వేదన వ్యక్తం చేశారు. భర్త మృతదేహం చూపించకుండా అత్తింటివారు కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్నారని ఆమె ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేయగా, ఎస్పీ వివరాలు సేకరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

9, జూన్ 2026

వరల్డ్ కప్ ముందు పోర్చుగల్‌కు షాక్‌..
క్రీడలు

వరల్డ్ కప్ ముందు పోర్చుగల్‌కు షాక్‌..

2026 ఫిఫా వరల్డ్ కప్కు ముందు చిలి వార్మప్ మ్యాచ్‌లో ఘర్షణ చెలరేగి పోర్చుగల్ స్టార్ వింగర్ రాఫెల్ లియావోకు రెడ్ కార్డు పడటంతో అతడు మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది. లియావోపై క్రమశిక్షణాత్మక చర్యలు, నిషేధం విధించే అవకాశంపై పోర్చుగల్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే గోన్సాలో గ్వెడెస్, బ్రూనో ఫెర్నాండెస్ గోల్స్‌తో పోర్చుగల్ 2–1 తేడాతో గెలిచింది.

7, జూన్ 2026

ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ హంగామా: కుకీస్‌పై  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌
టాలీవుడ్

ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ హంగామా: కుకీస్‌పై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ నుంచి అభిమానుల కామెంట్లకు వరుసగా వచ్చిన ఫన్నీ రిప్లైలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కుకీస్‌ బేకింగ్‌ వీడియో స్టోరీగా పెట్టడంతో, దాన్ని ఎక్స్‌లో షేర్‌ చేసి, అభిమానుల కామెంట్లకు బ్రహ్మానందం డైలాగ్‌లతో సరదాగా స్పందించారు. ఇవి నిజంగా ఎన్టీఆర్‌ రిప్లైలేనా, సోషల్‌ మీడియా టీమ్‌ క్రియేటివిటీనా అన్న చర్చ నడుస్తుండగా, వీకెండ్‌లో అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారాయి.

6, జూన్ 2026

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ
గుడ్ న్యూస్

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ

షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, Shark Tank India న్యాయనిర్ణేత అనుపమ్ మిట్టల్ నెలకు రెండుసార్లు జీతం చెల్లించే విధానాన్ని ప్రతిపాదించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఉద్యోగులకు నగదు ప్రవాహం మెరుగుపడి అద్దె, ఈఎంఐ, బిల్లుల భారం తగ్గుతుందని ఆయన భావిస్తున్నా, భారతీయ కార్మిక చట్టాలు, పన్ను, పేరోల్ వ్యవస్థలు నెలవారీ జీతాలకే అనుగుణంగా ఉండటంతో అమలు క్లిష్టమని నిపుణులు సూచిస్తున్నారు.

5, జూన్ 2026

నిర్మాతగా నాగచైతన్య తొలి అడుగు.. ‘దూత 2’ సీక్వెల్‌ ప్రారంభం
సినిమా

నిర్మాతగా నాగచైతన్య తొలి అడుగు.. ‘దూత 2’ సీక్వెల్‌ ప్రారంభం

హిట్‌ వెబ్‌సిరీస్‌ ‘దూత’ సీక్వెల్‌ ‘దూత 2’ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈసారి నాగచైతన్య ప్రధాన పాత్రతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించనుండటం ప్రత్యేకతగా మారింది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సీక్వెల్‌పై, మొదటి భాగం విజయంతో ప్రేక్షకులు, ట్రేడ్‌ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters