రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్:
ఏఐలో భారత ఐటీ కంపెనీల జోరు
రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయం
కృత్రిమ మేధ రంగంలో భారత ఐటీ సేవల కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయని ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్ వెల్లడించింది. ప్రస్తుతం ఏఐ విభాగం నుంచి దేశీయ ఐటీ సంస్థలు 10-12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధిస్తున్నాయని, ఇది సుమారు రూ.95,000 కోట్లు నుంచి 1.14 లక్షల కోట్ల వరకు ఉంటుందని సంస్థ అంచనా వేసింది. అయితే దేశీయ ఐటీ కంపెనీల్లో నాలుగో వంతు మాత్రమే తమ ఏఐ ప్రయోగాలను వాస్తవ వ్యాపార పరిష్కారాలుగా మార్చగలిగాయని నాస్‌కామ్ పేర్కొంది.
ఏఐ విస్తరణతో సంప్రదాయ ఐటీ సేవలకు డిమాండ్ తగ్గిపోతుందన్న ఆందోళనలను పరిశ్రమ ప్రముఖులు ఖండించారు. న్యూయార్క్‌లోని Consulate General of India కార్యాలయంలో జరుగుతున్న ‘NASSCOM US CEO Forum’ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఏఐ యుగంలో అంతర్జాతీయ కంపెనీల పరివర్తనకు ఐటీ రంగం కీలక కేంద్రంగా మారిందని, ఏఐ వల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు పునరావృత పనులు తగ్గుతున్నాయని నిపుణులు విశ్లేషించారు.
టెక్నాలజీ సమన్వయం, డేటా రెడీనెస్, ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ భద్రత, ఏజెంట్ మేనేజ్‌మెంట్, నిర్దిష్ట పరిశ్రమలకు అనుగుణమైన సొల్యూషన్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని వారు సూచించారు. ఈ మార్పుల నేపథ్యంలో సంప్రదాయ ఐటీ సేవలు కొత్త రూపంలో, అధునాతన ఏఐ సామర్థ్యాలతో కలిసిపోతున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఏఐ సేవల విస్తరణకు భారతీయ నిపుణుల బలమైన మానవ వనరులు తోడ్పడుతున్నాయని నాస్‌కామ్ వివరించింది. ఏఐ సేవల ద్వారా పరిశ్రమ 10-12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిందన్న అంచనా ఉందని, ఇందుకు సుమారు 20 లక్షల మంది ఏఐ నిపుణులు, అధునాతన ఏఐలో నైపుణ్యం కలిగిన రెండు లక్షల వరకు ప్రొఫెషనల్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లలో సుమారు 85 శాతం వరకు Agentic AI ప్లాట్‌ఫారాలు ఉన్నాయని నాస్‌కామ్ పేర్కొంది.
భవిష్యత్తు అవకాశాలపై కూడా నాస్‌కామ్ ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి Agentic AI ద్వారా అదనంగా 300-400 బిలియన్ డాలర్ల వరకు వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. ఇందులో legacy modernization, ఏఐ కార్యకలాపాలు, cyber security, governance వంటి సేవలకు గిరాకీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఏఐ వ్యవస్థలు క్రమంగా production దశకు అడుగులు వేస్తుండడంతో వాటిని సమర్థంగా నిర్వహించడానికి కంపెనీలకు ప్రత్యేక భాగస్వాముల అవసరం పెరుగుతుందని NASSCOM President రాజేశ్ నంబియార్ స్పష్టం చేశారు. మోడళ్లు, యాప్‌లు, డేటా ప్లాట్‌ఫామ్‌లు, cloud, cyber security controls, నిబంధనల అవసరాలను సమన్వయం చేస్తూ కంపెనీలు ఒక విశ్వసనీయ operating modelను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.







