రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా వైఎస్సార్ కడపలోని వేముల మండలంలో జరుగుతున్న అక్రమ ముగ్గురాయి (Barytes) మైనింగ్‌పై ఒకటిన్నర సంవత్సరం తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. వేముల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, అనంతరం జరిగిన విచారణ ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు సమాచారం.
వేముల మండలంలో టిఫిన్ కంపెనీకి చెందిన Barytes గనులు ఉన్నాయి. గత పదేళ్లుగా టిఫిన్ Barytes మైన్స్‌కు ప్రతినిధిగా పనిచేస్తున్న White Barytes ప్రతినిధి రాము, అరుదైన ఈ ఖనిజాన్ని కాపాడాలంటూ పోలీసులకు, సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.
రాము ప్రకారం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ మైనింగ్ జరుగుతోందని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ముగ్గురాయి కోర్టు పరిధిలో ఉండగా, దానిని అక్రమంగా తరలిస్తున్నారని పలుమార్లు అధికారులకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.
NCMLT తరఫున MSC సంస్థ తనను టేక్‌కేర్‌గా నియమించుకున్నారని రాము తెలిపారు. వేల టన్నుల ముగ్గురాయిని రాత్రికి రాత్రే అక్రమంగా తరలించారని, దీనిపై వేముల పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన వేముల సిఐ, తగిన ఆధారాలు సమర్పించాలని రామును కోరినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా, అక్రమంగా ముగ్గురాయి తరలించిన తేదీలకు సంబంధించిన ఆధారాలు సహా అవసరమైన సమాచారం అందజేశానని రాము తెలిపారు.
“విచారణ అధికారి వేముల సిఐ తగు ఆధారాలు చూపించమని కోరడంతో తగు ఆధారాలను చూపించడం జరిగింది. వేముల సిఐ పలు ప్రశ్నలు అడుగగా వాటికి నేను ఆధారాలు చూపించడం జరిగింది. ఏ తేదీ లో ముగ్గురాయిని తరలించారో ఆధారాలు చూపించడం జరిగింది,” అని రాము చెప్పారు.
వేముల మండలంలో ఇప్పటికీ అక్రమ మైనింగ్ కొనసాగుతోందని రాము ఆరోపించారు. ఈ కేసు నమోదు, విచారణ వివరాలపై మరిన్ని సమాచారం కోసం స్థానికులు, బాధితులు ఎదురుచూస్తున్నారు.













