బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కార్యదర్శి

52 articles

కడపలో మంచినీటి సమస్య తీవ్రం: CPI నిరసన
జిల్లా వార్తలు

కడపలో మంచినీటి సమస్య తీవ్రం: CPI నిరసన

కడప నగరంలో, ముఖ్యంగా 15వ డివిజన్ సాగర్ కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. CPI ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి, మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

8, ఆగ 2026

మదనపల్లెలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ
జిల్లా వార్తలు

మదనపల్లెలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ

మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అడపా సురేంద్ర నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో చేనేత రంగ ప్రాధాన్యం, కార్మికుల సమస్యలు, మార్కెట్ ఇబ్బందులు, ముడి సరుకుల వ్యయభారం, ఆధునికీకరణ అవసరాలపై చర్చించి, చేనేత ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం, సరైన ధరలు, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం, అధికారులను కోరారు.

7, ఆగ 2026

యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: DYFI డిమాండ్
జిల్లా వార్తలు

యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: DYFI డిమాండ్

DYFI నాయకులు ప్రొద్దుటూరులో జరిగిన పట్టణ మహాసభల్లో ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, రూ.3000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరుతూ, యువత హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

7, ఆగ 2026

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు
జిల్లా వార్తలు

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు

ఒంటిమిట్ట ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా కప్పి సన్మానించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు, సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య సేవల్లో వారి పాత్రపై సానుకూలంగా చర్చించినట్టు ప్రతినిధులు తెలిపారు.

7, ఆగ 2026

ప్రొద్దుటూరు 27వ వార్డులో ట్రాన్స్ఫార్మర్‌కు ఇనుప గ్రిల్ ఏర్పాటు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు 27వ వార్డులో ట్రాన్స్ఫార్మర్‌కు ఇనుప గ్రిల్ ఏర్పాటు

ప్రొద్దుటూరు 27వ వార్డులోని C.S.I చర్చి సమీప ట్రాన్స్ఫార్మర్‌కు ఇనుప గ్రిల్ లేకపోవడంతో ప్రమాదం ఉందని ప్రజలు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించగా, బుధవారం ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసి, స్థానికులకు భద్రత కల్పించారు.

5, ఆగ 2026

రాచమల్లు పై టీడీపీ నేత జబీవుల్ల తీవ్ర విమర్శలు
జిల్లా వార్తలు

రాచమల్లు పై టీడీపీ నేత జబీవుల్ల తీవ్ర విమర్శలు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్ల, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పై భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు, భూసేకరణ, పేదల భూముల కబ్జాలు, కమిషన్ల ఆరోపణలతో తీవ్ర విమర్శలు చేశారు. రాజా ఫౌండేషన్ అధినేత హత్య, నందం సుబ్బయ్య హత్య కేసుల్లో అధికార బలం ఉపయోగించి పేర్లు తప్పించుకున్నారని ఆరోపిస్తూ, రేపటి నుండి రాచమల్లు అవినీతి చిట్టాను ఆధారాలతో బయటపెడతానని జబీవుల్ల హెచ్చరించారు.

5, ఆగ 2026

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
జిల్లా వార్తలు

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరగనున్న 8వ మహాసభల కరపత్రాలను ముద్దనూరులో ఆవిష్కరించారు. కడప జిల్లాలో సిమెంట్, సోలార్ పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని వీరాణాల శివకుమార్ విమర్శించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో జమ్మలమడుగులో జరిగే మహాసభల్లో విస్తృత చర్చలు, అనంతరం సమగ్ర పోరాట కార్యక్రమం చేపడతామని డివైఎఫ్‌ఐ నాయకత్వం ప్రకటించింది.

5, ఆగ 2026

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల
జిల్లా వార్తలు

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని ఆగస్టు 2 తెల్లవారుజామున చిప్పగిరిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్‌లో వెల్లడించారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 37/2026, 38/2026 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, మొత్తం 34 మందిపై చర్యలు తీసుకుని, ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

5, ఆగ 2026

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు

అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

3, ఆగ 2026

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన
జిల్లా వార్తలు

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరసన నిర్వహించి, చేనేత రంగం క్షీణతతో జీవనోపాధి దెబ్బతింటోందని, ఇళ్లలో ఉన్న విద్యుత్ మీటర్ల వల్ల అధిక బిల్లులు వచ్చి ఆర్థిక భారంతో నలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, నేతన్న నేస్తం పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చేసి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

3, ఆగ 2026

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు
జిల్లా వార్తలు

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో 'చలో కలెక్టరేట్ ’ధర్నాకు సంబంధించి పెనుకొండలో AP అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ , CITU ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాలు, సేవా నిబంధనలు, ఇతర హక్కుల సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు.

31, జులై 2026

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు
జిల్లా వార్తలు

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు

జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపికలను ఆగస్టు 2న కడపలోని RSR క్రికెట్ అకాడమీలో నిర్వహించనున్నట్లు AP టెన్నిస్ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అండర్-15, అండర్-19 బాలురతో పాటు సీనియర్ బాలికల విభాగానికి జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, మరిన్ని వివరాల కోసం అసోసియేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

30, జులై 2026

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో సుభదీప్ ఘోష్
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో సుభదీప్ ఘోష్

భారత జట్టులో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ Doeschate, ఫీల్డింగ్ కోచ్ T దిలీప్ కాంట్రాక్టులు పొడగించకూడదని BCCI నిర్ణయించడంతో కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. BCCI కార్యదర్శి దేవాజిత్ సాయికియా ప్రకారం ఇద్దరు–ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉండగా, దేశవాళీ, NCA, ఇండియా A, అండర్ -19, IPL స్థాయిల్లో విస్తృత అనుభవం ఉన్న శుభదీప్ ఘోష్ ప్రధాన ఫేవరెట్‌గా, శ్రీ లంక పర్యటనకు ముందు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

29, జులై 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ :  వెంటనే తొలగించాలని ఆదేశం.!
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ : వెంటనే తొలగించాలని ఆదేశం.!

హైదరాబాద్‌ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

27, జులై 2026

ప్రొద్దుటూరులో RTC పాత బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో RTC పాత బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు

ప్రొద్దుటూరు RTC పాత బస్ స్టాండ్ వద్ద మసీదు లోనికి వెళ్లే దారిని ఆటోలు, తోపుడు బండ్లు అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. V.S. ముక్తియార్ స్థలాన్ని పరిశీలించి, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, ట్రాఫిక్ పోలీసులతో చర్చించి, మసీదు మార్గం నిర్బంధం లేకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

26, జులై 2026

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు
జాతీయం

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

25, జులై 2026

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ
జాతీయం

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది.

24, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
తెలంగాణ

మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్ డి బోధి పెవిలియన్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్‌ల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దని, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసి ప్రాజెక్టులు గడువులో పూర్తి చేయాలని, సైబరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం జంక్షన్ అభివృద్ధిని HMDA వెంటనే పురోగతి పరచాలని అధికారులకు ఆదేశించారు.

23, జులై 2026

అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోరిన పాకిస్తాన్
అంతర్జాతీయం

అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోరిన పాకిస్తాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, అమెరికా నుంచి ఐదేళ్ల కాలపరిమితితో 10 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ఆర్థిక సహాయాన్ని కోరింది. IMF, China, Saudi Arabia వంటి వనరులపై ఆధారపడుతున్న పాక్‌కు విదేశీ మారక నిల్వలు, కరెన్సీ స్థిరీకరణ, చెల్లింపుల సమతుల్యత సమస్యల పరిష్కారానికి ఈ సహాయం కీలకమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

22, జులై 2026

నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి : సీఎం బాబు, మంత్రి లోకేష్ సీరియస్‌..
నేరాలు

నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి : సీఎం బాబు, మంత్రి లోకేష్ సీరియస్‌..

గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

18, జులై 2026

జులై 26న నాగర్ కర్నూల్‌లో ఏఐటీయూసీ 3వ మహాసభలు
జిల్లా వార్తలు

జులై 26న నాగర్ కర్నూల్‌లో ఏఐటీయూసీ 3వ మహాసభలు

జులై 26న నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సుండీపెంటలో ఏఐటీయూసీ 3వ మహాసభలు జరగనున్నాయి. ఆర్టిజన్ల పర్మినెంట్ ఉద్యోగాలు, APSEB సర్వీస్ రూల్స్ అమలు, Jenco ప్రైవేటీకరణ వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు వంటి అంశాలపై విస్తృత చర్చతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. తాడూరు మండల కేంద్రంలో జరిగే మహా ప్రదర్శనకు కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని నాయకత్వం పిలుపునిస్తోంది.

16, జులై 2026

అమల్లోకి భారత్–యూకే సమగ్ర వాణిజ్య ఒప్పందం
అంతర్జాతీయం

అమల్లోకి భారత్–యూకే సమగ్ర వాణిజ్య ఒప్పందం

భారత్–యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చి, భారత్ నుంచి యూకేకు వెళ్లే దాదాపు 99 శాతం ఎగుమతులకు సుంకం రహిత ప్రవేశం కల్పించనుంది. ప్రతిగా బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, ప్రీమియం మద్యం, సాల్మన్ చేపలు, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, ఆరోగ్య పరికరాలు వంటి అనేక ఉత్పత్తులపై భారత్ దశలవారీగా సుంకాలు తగ్గించగా, పాలు, చక్కెర, బియ్యం వంటి కీలక వ్యవసాయ ఉత్పత్తులను ఒప్పందం పరిధి నుంచి మినహాయించారు.

15, జులై 2026

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌కి కసరత్తు
ఉద్యోగాలు

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌కి కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ విడతలో 3,168 పోస్టులు, అందులో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 91 Group-1 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. ఆగస్టు 15న నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండగా, కొత్త Local Cadre విధానం, Reservation Roster, ఖాళీల వివరాలపై సీఎస్ సాయిప్రసాద్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

14, జులై 2026

విద్యుత్ లైన్ అలైన్‌మెంట్ మార్చాలని రైతుల ధర్నా
జిల్లా వార్తలు

విద్యుత్ లైన్ అలైన్‌మెంట్ మార్చాలని రైతుల ధర్నా

కడప జిల్లా సికే దిన్నె మండలంలో ఏర్పాటు చేస్తున్న 765 కెవి విద్యుత్ హై వోల్టేజ్ లైన్‌కు వ్యతిరేకంగా రైతులు NTPC Power Grid కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విలువైన పంట భూములపై లైన్‌ నిర్మాణం వల్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, లైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రాజెక్టు అమలు చేయాలని Power Grid అధికారులకు వినతిపత్రం అందజేశారు.

12, జులై 2026

తితిదే ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఐఏఎస్‌ కన్నబాబు ప్రమాణ స్వీకారం
జిల్లా వార్తలు

తితిదే ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఐఏఎస్‌ కన్నబాబు ప్రమాణ స్వీకారం

దేవాదాయ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్‌ కన్నబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా రంగనాయకుల మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మూలవిరాట్టు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తితిదే నిర్వహణ, సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల మెరుగుదలలో ఆయన సభ్యత్వం కీలక పాత్ర పోషించనుందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

8, జులై 2026

వ్యవసాయం నుంచి క్వాంటం వరకు..  ఏపీ దూసుకుపోతోంది : నారా  లోకేష్
రాజకీయాలు

వ్యవసాయం నుంచి క్వాంటం వరకు.. ఏపీ దూసుకుపోతోంది : నారా లోకేష్

నారా లోకేష్ అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం నుంచి క్వాంటం టెక్నాలజీ, సంజీవని నుంచి స్మార్ట్ హెల్త్‌కేర్ వరకు అన్ని కీలక రంగాల్లో సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది. సంప్రదాయ రంగాల బలోపేతంతో పాటు ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, యువత ఉపాధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలలో రాష్ట్రం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

8, జులై 2026

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు వైసీపీ కట్టుబడి ఉంది : శిల్పా చక్రపాణి రెడ్డి
జిల్లా వార్తలు

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు వైసీపీ కట్టుబడి ఉంది : శిల్పా చక్రపాణి రెడ్డి

కర్నూలు జిల్లా Apostolic Church 7వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు వైయ‌స్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉందని, వారి రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ డిమాండ్‌పై రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన ఘనత వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.

7, జులై 2026

బాల కార్మిక నిర్మూలన లక్ష్యంగా కర్నూలులో ఆకస్మిక తనిఖీలు
జిల్లా వార్తలు

బాల కార్మిక నిర్మూలన లక్ష్యంగా కర్నూలులో ఆకస్మిక తనిఖీలు

కర్నూలు జిల్లాలో బాల కార్మిక నిర్మూలన లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, బళ్లారి చౌరస్తా ప్రాంతాల్లో ముగ్గురు బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు పంపించారు. బాల కార్మికత్వం చట్టవిరుద్ధమని, పిల్లలను పాఠశాలకు పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అధికారులు హెచ్చరిస్తూ, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 15100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

4, జులై 2026

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..
జాతీయం

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..

పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది.

1, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters