బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కనిపించిన

24 articles

హిందూపురం మండలంలో చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం
జిల్లా వార్తలు

హిందూపురం మండలంలో చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం

హిందూపురం మండలం కొట్నూరు చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమై స్థానికుల్లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు పరిసరాల్లో ముమ్మరంగా పరిశీలనలు జరిపి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతురాలి గుర్తింపు, మరణానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, ఆగ 2026

‘రామాయణం’లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదన్న సందేహానికి రణబీర్ కపూర్ క్లారిటీ
సినిమా

‘రామాయణం’లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదన్న సందేహానికి రణబీర్ కపూర్ క్లారిటీ

నితేష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణం’ ట్రైలర్‌లో హనుమంతుడు కనిపించకపోవడంపై వచ్చిన సందేహాలకు రణబీర్ కపూర్ స్పష్టత ఇచ్చారు. కథ మొదటి భాగం సీతాపహరణం వరకు మాత్రమే సాగుతుందని, వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడి ప్రవేశం రెండో భాగంలోనే ఉండటంతో సన్నీ డియోల్ పాత్రను అక్కడ గ్రాండ్‌గా చూపించబోతున్నట్లు తెలిపారు. కథ సారాన్ని మార్చకుండా, ఆధునిక విజువల్ టెక్నాలజీతో రెండు భాగాల్లో చెప్పేందుకు బృందం కృషి చేసిందని రణబీర్ పేర్కొనగా, సన్నీ డియోల్ లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

5, ఆగ 2026

తిరుమలలో హార్దిక్ పాండ్యా తలనీలాలు సమర్పణ.. కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్
జిల్లా వార్తలు

తిరుమలలో హార్దిక్ పాండ్యా తలనీలాలు సమర్పణ.. కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో, గుండు లుక్‌తో దర్శనమిచ్చిన ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్‌ను వీడి కొత్త జట్టులో చేరే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

2, ఆగ 2026

‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ విడుదల..
సినిమా

‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ విడుదల..

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. థ్రిల్‌, హాస్యం, హారర్‌ మేళవింపుతో, కొరియన్ నేపథ్యంపై సాగే ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుండగా, తమన్ సంగీతం, సాంకేతిక నిపుణుల పనితనం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

2, ఆగ 2026

రివ్యూ..  ‘హే చికీతా’పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా
సినిమా రివ్యూలు

రివ్యూ.. ‘హే చికీతా’పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా

పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా రూపొందిన ‘హే చికీతా’ చిత్రం నాగనూరు, లచ్చక్కపేట గ్రామాల నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా. అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయ్ నటన, పల్లెటూరి వాతావరణం, రైతు సమస్యలను ప్రశ్నించే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథలో కొంత రొటీన్ ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా, రైతు జీవితం నేపథ్య కథలను ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది.

30, జులై 2026

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం బలమైన లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 888 పాయింట్లు పెరిగి 77,654కి, నిఫ్టీ 264 పాయింట్లు ఎగసి 24,250కి చేరి కీలక మానసిక స్థాయిలకు పైగా నిలిచాయి. వరుస చలనం తర్వాత వచ్చిన ఈ పెరుగుదల పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని, అయితే అధిక స్థాయిల వద్ద జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

29, జులై 2026

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్
క్రీడలు

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్

భారత క్రికెట్ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌తో తన ప్రేమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ “My Person” క్యాప్షన్‌తో అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్ 2026 సమయంలో మొదలైన డేటింగ్ వార్తలకు ఈ పోస్టుతో ముగింపు లభించగా, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

27, జులై 2026

నష్టాల్లో ముగిసిన షేర్ మార్కెట్లు.. :  ఐటీ, ఫార్మా అండగా నిలిచినా తప్పని పతనం!
బిజినెస్

నష్టాల్లో ముగిసిన షేర్ మార్కెట్లు.. : ఐటీ, ఫార్మా అండగా నిలిచినా తప్పని పతనం!

గత వారం చివరి సెషన్‌లో భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ వారంలో మాత్రం నిరాశాజనకంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రధాన సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.

20, జులై 2026

నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ: ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి
తెలంగాణ

నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ: ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలో MBBS విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న, చరణ్ అనుమానాస్పద పరిస్థితుల్లో గంటల వ్యవధిలో మృతి చెందడంతో డబుల్ డెత్ మిస్టరీగా మారింది. లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, చరణ్ వేధింపుల వల్లే ఆమె మృతి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించగా, చరణ్ తన తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు రాసిన విషయం కేసును మరింత సంక్లిష్టం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

18, జులై 2026

13 మందితో ఇరాన్ హిట్‌లిస్ట్‌.. అందులో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ
అంతర్జాతీయం

13 మందితో ఇరాన్ హిట్‌లిస్ట్‌.. అందులో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ

పశ్చిమాసియాలో యుద్ధం ఆగినట్టే కనిపించినా.. ఇటీవల మళ్లీ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన- అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హర్మూజ్‌లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు చేయడం తాజా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యంపోసింది.

13, జులై 2026

పింఛను కోసం వెళ్తే ఖాతాలో.. ..   ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్
జాతీయం

పింఛను కోసం వెళ్తే ఖాతాలో.. .. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య పింఛను, దివ్యాంగ పింఛను తీసుకునేందుకు బ్యాంకు కేంద్రానికి వెళ్లిన తండ్రీకొడుకులు తమ ఖాతాల్లో కనిపించిన భారీ మొత్తాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

13, జులై 2026

అయోధ్య కేసు.. సిట్‌ చేతిలో కీలక అధరాలు
జాతీయం

అయోధ్య కేసు.. సిట్‌ చేతిలో కీలక అధరాలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సిట్‌ సీసీటీవీ ఆధారాలతో కీలక వివరాలు బయటపెట్టింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు లెక్కింపు బాధ్యతలు చూసిన కొంతమంది సిబ్బంది దాదాపు 70 సార్లు నగదు, నగలను అపహరించినట్టు, భద్రతా వ్యవస్థల్లో తీవ్ర లోపాలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. అవినాష్‌ శుక్లా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌ సహా ఆరుగురికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించడంతో, గత ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్‌ చేస్తూ ప్రభుత్వం తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.

7, జులై 2026

కల్వర్టు నీటి కుంటలో శవం
జిల్లా వార్తలు

కల్వర్టు నీటి కుంటలో శవం

యలగలవంక గ్రామానికి చెందిన హరిజన కేశన్న శవం కల్వర్టు కింద ఉన్న నీటి కుంటలో తేలియాడుతూ కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన కేశన్న శవాన్ని శుక్రవారం పశువుల కాపరులు గుర్తించగా, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

4, జులై 2026

అద్భుత రీ ఎంట్రీతో బెల్జియం విజయం…
క్రీడలు

అద్భుత రీ ఎంట్రీతో బెల్జియం విజయం…

ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో బెల్జియం అద్భుత పునరాగమనం చేసి సెనెగల్‌పై 3-2 తేడాతో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. 0-2తో వెనుకబడిన బెల్జియం తరఫున రొమెలు లుకాకు, యూరి టీలెమాన్స్‌ గోల్స్‌తో స్కోరును సమం చేయగా, అదనపు సమయం చివరి సెకన్లలో టీలెమాన్స్‌ పెనాల్టీ గోల్‌ బెల్జియంకు నాటకీయ విజయాన్ని అందించింది.

3, జులై 2026

ఐర్లాండ్‌ చేతిలో షాక్‌.. అయినా సెమీస్‌కు విండీస్
క్రీడలు

ఐర్లాండ్‌ చేతిలో షాక్‌.. అయినా సెమీస్‌కు విండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌–2 నుంచి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సెమీఫైనల్స్‌కు చేరాయి. ఐర్లాండ్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడినా, న్యూజిలాండ్‌ ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలవడంతో వెస్టిండీస్‌ రెండో స్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అదే గ్రూప్‌లో శ్రీలంక స్కాట్లాండ్‌పై గెలిచింది కాగా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ జట్లు లీగ్‌ దశతోనే నిష్క్రమించాయి.

28, జూన్ 2026

నాలుగేళ్ల రుత్విక అనుమానాస్పద మృతి కలకలం
జిల్లా వార్తలు

నాలుగేళ్ల రుత్విక అనుమానాస్పద మృతి కలకలం

కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన నాలుగేళ్ల రుత్విక నీళ్ల ట్యాంకులో మృతదేహంగా లభ్యమవడంతో గ్రామంలో కలకలం రేగింది. ట్యాంకు ఎత్తు కారణంగా ప్రమాదవశాత్తు పడిపోయిందా అన్న అనుమానాలతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఓ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

26, జూన్ 2026

గర్భవతిననే క్లారిటీ ఇచ్చిన సమంత… మెటర్నిటీ లీవ్‌కు రెడీ
టాలీవుడ్

గర్భవతిననే క్లారిటీ ఇచ్చిన సమంత… మెటర్నిటీ లీవ్‌కు రెడీ

నటి సమంత తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ధృవీకరించి, త్వరలో మెటర్నిటీ లీవ్‌ తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవాల్లో బేబీ బంప్‌తో కనిపించిన ఆమెపై వచ్చిన వార్తలకు ఈ ప్రకటనతో ముగింపు లభించింది. రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత చేసిన ఈ తొలి చిత్రం విజయంతో పాటు గర్భవార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

25, జూన్ 2026

గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ పార్టీ..
జాతీయం

గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ పార్టీ..

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ సేవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి, పడవను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర గంగానదిలో ఇలాంటి చర్యలు మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నాయని స్థానికులు, భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో శ్రావణ మాసం ముందు నగరంలోని మాంసం, చేపలు, పౌల్ట్రీ దుకాణాలను శివార్లకు తరలించే నిర్ణయంపై మద్దతుతో పాటు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి.

25, జూన్ 2026

ఇంట్లో పగిలిన విగ్రహాలు, చినిగిన దేవుడి పటాలు ఉంచకండి: పండితుల హెచ్చరిక
భక్తి

ఇంట్లో పగిలిన విగ్రహాలు, చినిగిన దేవుడి పటాలు ఉంచకండి: పండితుల హెచ్చరిక

జ్యోతిష్య, వాస్తు నిపుణుల ప్రకారం ఇంట్లో పగిలిన విగ్రహాలు, చినిగిన దేవుడి పటాలు ఉంచడం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని భావిస్తున్నారు. పెద్ద సైజు విగ్రహాలు ఇంట్లో పెట్టకూడదని, పెట్టిన వారు నిత్య పూజా విధులు కచ్చితంగా చేయాలని, పగిలిన విగ్రహాలు, గాజు వస్తువులు వెంటనే తొలగించడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

21, జూన్ 2026

మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్‌
బిజినెస్

మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్‌

Mahindra Thar Roxx‌పై కంపెనీ రూ.1.40 లక్షల వరకు నేరుగా తగ్గింపు ప్రకటించింది. 5-డోర్ల ఈ SUVలో ప్రీమియం ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, Level-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలు ఉండగా, పెట్రోల్‌కు లీటరుకు 10–12, డీజిల్‌కు 13–15 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది. ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షల వరకు ఉండగా, ఆఫర్ వివరాల కోసం Mahindra డీలర్‌షిప్‌లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

16, జూన్ 2026

వైభవ్ ను రెచ్చగొట్టి.. సూపర్‌ ఓవర్ లో ఉత్కంఠ..
క్రీడలు

వైభవ్ ను రెచ్చగొట్టి.. సూపర్‌ ఓవర్ లో ఉత్కంఠ..

దంబుల్లాలో జరిగిన ముక్కోణపు వన్డేలో భారత్‌-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్లో 7 పరుగుల తేడాతో లంక జట్టు గెలిచింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో లెగ్‌బై, వైడ్‌, నోబాల్‌ నిర్ణయాలపై భారత్‌-ఎ కెప్టెన్‌ తిలక్‌ వర్మ సహా ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వెలుతురు తగ్గినా సూపర్‌ ఓవర్‌ ఆడించాలని అంపైర్లు పట్టుబట్టడంతో వాదనలు చెలరేగాయి. మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ సూర్యవంశీ, హలంబాగే మధ్య వాగ్వాదం, విప్రాజ్‌ నిగమ్‌పై విధించిన 10 పరుగుల పెనాల్టీతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

16, జూన్ 2026

ప్రతి హామీకి  కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌
రాజకీయాలు

ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌

ప్రజల తీర్పు చరిత్ర సృష్టించిందని, కూటమి అధికారం కోసం కాదు బాధ్యత కోసం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేనకు కేటాయించిన 21 స్థానాలన్నింటిలో విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని, ఎన్నికల హామీల అమలు, పంచాయతీరాజ్‌ బలోపేతంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని దామినేడులో జరిగిన బహిరంగ సభలో చెప్పారు.

12, జూన్ 2026

ఆర్కే బీచ్‌లో ఆదిత్య 369 ‘టైమ్‌ మెషీన్‌’ ప్రతిరూపం సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది
ఆంధ్రప్రదేశ్

ఆర్కే బీచ్‌లో ఆదిత్య 369 ‘టైమ్‌ మెషీన్‌’ ప్రతిరూపం సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్‌ చిత్రం ఆదిత్య 369లోని టైమ్‌ మెషీన్‌ నమూనాను ప్రతిరూపంగా ఏర్పాటు చేయడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యారు. 94 ఏళ్ల వయసులో ఆయన రూపొందించిన కొత్త చిత్రం సింగ్‌..గీతం ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతిలో, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల పోస్టర్లను ప్రదర్శించగా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఆనందించారు.

7, జూన్ 2026

ఫుడ్ పాయిజన్ కలకలం: తమిళనాడు కాంచీపురంలో 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థత
జాతీయం

ఫుడ్ పాయిజన్ కలకలం: తమిళనాడు కాంచీపురంలో 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థత

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్‌లో భోజనం చేసిన తర్వాత 100 మందికిపైగా ఉద్యోగులు ఫుడ్ పాయిజన్‌కు గురై వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రుల్లో చేరారు. బిర్యానీ కారణమై ఉండొచ్చని అనుమానంతో అధికారులు ఆహార నమూనాలను ప్రయోగశాలకు పంపి, వంటశాల పరిశుభ్రత, నిల్వ విధానాలపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, మొత్తం మీద ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters