రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు, పెద్దటేకూరు గ్రామాల్లో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం భాగంగా సీసీ రోడ్ల పనులు పూర్తి కావడంతో వాటిని అధికారికంగా ప్రారంభించారు. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా చిన్నటేకూరు గ్రామంలో రూ.47 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గౌరు చరిత రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో సమావేశమయ్యారు.
తరువాత పెద్దటేకూరు గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ పనులు పూర్తయ్యాయి. ఈ గ్రామంలో కూడా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పెద్దటేకూరు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనను ఎరిగారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలిపారు.
ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన లభించింది అని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, పాణ్యం నియోజకవర్గం పరిశీలకులు చల్లా లక్ష్మీ ప్రసాద్, చిన్నటేకూరు గ్రామ నాయకులు రామాంజనేయులు, శేష గిరి, లక్ష్మన్న, అశోక్, రామ చంద్రుడు, రాజశేఖర్, మౌలాలి, పెద్దటేకూరు గ్రామ నాయకులు సాయి తరుణ్ కుమార్ రెడ్డి, సురేష్, రామకృష్ణ, మోహన్, నాగరాజు, పుల్లన్న, ముని స్వామి, జనసేన నాయకుడు బజారన్న, ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఇవి రమణ, తడకనపల్లి మాజీ సర్పంచ్ సహారా బి, క్లస్టర్ ఇంచార్జి మహానంది, ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.













