కోల్‌కతాలో 35,000 మందితో కలిసి యోగా

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 కోల్‌కతాలో 35,000 మందితో కలిసి ప్రధాని మోడీ యోగా..

ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో లక్షలాది మంది యోగా సాధనలో పాల్గొంటున్నారు. భారతదేశంలో ప్రధాన వేడుకలు కోల్‌కతా నగరంలోని రెడ్ రోడ్‌లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 35,000 మందికి పైగా ప్రజలతో కలిసి 45 నిమిషాల పాటు యోగా సాధన చేయనున్నారు.

ప్రధాని మోడీ పాల్గొనే యోగా సెషన్ ప్రాణాయామంతో ప్రారంభమై, ధ్యానంతో ముగుస్తుంది. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

దేశవ్యాప్తంగా యోగా సందడి

యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హిమాలయ ప్రాంతమైన Drass మంచు శిఖరాల వద్ద సైనికులు యోగా చేశారు. అలాగే బంగాళాఖాతంలోని జలాంతర్గామిలో కూడా సైనిక సిబ్బంది యోగా సాధన నిర్వహించారు. Mumbai లో ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలో డ్రోన్ల సహాయంతో యోగాసనాల చిత్రీకరణ చేపట్టారు.

కోల్‌కతాలో 10 లక్షల మంది యోగా

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా. అయితే, పశ్చిమ బెంగాల్‌లో వర్ష హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని నాలుగు ప్రాంతాల్లో “రన్ ఫర్ యోగా” కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 10,000 మంది పాల్గొంటున్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్స్ (2015–2026)

2015 – సామరస్యం మరియు శాంతి కోసం యోగా
2016 – యువతను అనుసంధానించండి
2017 – ఆరోగ్యం కోసం యోగా
2018 – శాంతి కోసం యోగా
2019 – హృదయం కోసం యోగా
2020 – ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా
2021 – శ్రేయస్సు కోసం యోగా
2022 – మానవత్వం కోసం యోగా
2023 – వసుధైవ కుటుంబకం కోసం యోగా
2024 – స్వీయ మరియు సమాజం కోసం యోగా
2025 – ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా
2026 – దీర్ఘాయువు మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా