ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక సంవత్సరం తర్వాత పదవిలో ఉండరని, ప్రస్తుత ప్రభుత్వం లోపల నుంచే “ఇన్స్టిట్యూషనల్ రివోల్ట్ ” ఎదుర్కొంటోందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యవస్థలోని వర్గాల నుంచి తనకు “ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ” వస్తోందని ఆయన తెలిపారు. న్యూ ఢిల్లీ లో జరిగిన కాంగ్రెస్ నేషనల్ ఆదివాసీ ప్రొఫెషనల్ కాంక్లేవ్ అనే పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు కీలక పరిణామాలు ఒకేసారి జరుగుతున్నాయని, దేశాన్ని అపూర్వమైన “ ఎకనామిక్ సునామి ” తాకబోతోందని, అలాగే మోడీ ప్రభుత్వానికి సంస్థలపై ఉన్న నియంత్రణ కూలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్థిక దెబ్బల నుంచి రక్షణ కల్పించే అనేక రక్షణ కవచాలను తొలగించిందని, దాని ఫలితంగా దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచున నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ఒత్తిడిని అణచివేయడానికి ప్రభుత్వం “ ఎమర్జెన్సీ లాంటి దాన్ని” అమలు చేసే అవకాశముందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ , యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా , ఆయన కుమారుడు, ఇతర యూనియన్ మినిస్టర్స్ , నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ అజిత్ దోవల్ , ఆయన కుమారుల గురించి తాను తరచూ సమాచారం అందుకుంటున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఆ సమాచారం స్వరూపం, వివరాలను ఆయన వెల్లడించలేదు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై BJP తీవ్రంగా స్పందించింది. మోడీ , కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న ఆరోపణలు అసత్యమని, సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం లాగుతున్నారని BJP నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులపై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన ఆందోళనలను సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.