రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారం పర్యటించనున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.







