బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మోహన్

96 articles

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌.. ఐదుగురు అరెస్ట్‌
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌.. ఐదుగురు అరెస్ట్‌

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి సమీపంలో ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.10 లక్షల విలువైన ఆరు దుంగలు, ఒక షిఫ్టు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడిస్తూ, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

25, ఆగ 2026

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జిల్లా వార్తలు

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లలో ఈశ్వరయ్య హత్య కేసులో రాయచోటి రాయుడు కాలనీకి చెందిన సింహాద్రి, ఫరూక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీరు బాటిల్స్ గాజు ముక్కలు, బండరాయితో దాడి చేసి ఈశ్వరయ్యను హత్య చేసినట్లు డిఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచారు.

25, ఆగ 2026

నిలిచిపోయిన ‘తని ఒరువన్ 2’ సినిమా: నిర్మాత స్పష్టత
సినిమా

నిలిచిపోయిన ‘తని ఒరువన్ 2’ సినిమా: నిర్మాత స్పష్టత

‘తని ఒరువన్ 2’ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయిందని నిర్మాత అర్చన కల్పతి స్పష్టం చేశారు. భారీ బడ్జెట్, అనుకూలంగా లేని మార్కెట్ పరిస్థితులు, రవి మోహన్, నయనతార, మోహన్ రాజా ఇతర కమిట్‌మెంట్లు కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదని ఆమె తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు కాలేదని, పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ ముందుకు సాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

9, ఆగ 2026

సోమవారం ప్రొద్దటూరులో  DSC అక్రమాలపై  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ
జిల్లా వార్తలు

సోమవారం ప్రొద్దటూరులో DSC అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రేపు ఉదయం 9.30 గంటలకు DSC అక్రమాలు, ఫీజు రీ ఎంబర్స్మెంట్, నోరుద్యోగ భృతి వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. మునిసిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీని రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నడిపించగా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా చేయడమే లక్ష్యంగా పార్టీ గ్రామ, వార్డు కమిటీలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

9, ఆగ 2026

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్
జిల్లా వార్తలు

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్

కదిరి ప్రాంతంలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న బి.యస్. మక్బూల్, DSC–2025 నియామకాలలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులు నియామకాలలో పారదర్శకత లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం, నిరుద్యోగ భృతి అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు.

9, ఆగ 2026

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం
జిల్లా వార్తలు

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం

జమ్మలమడుగులో రిలే నిరాహార దీక్ష సమయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు ఉద్రిక్తతకు దారితీస్తూ, వైఎస్ఆర్సిపి దీనిని అక్రమ చర్యగా అభివర్ణిస్తోంది. DSC నియామకాల్లో అక్రమాలు, పారదర్శకత లోపంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతుండగా, జమ్మలమడుగులో రాజకీయ వేడి చెలరేగింది.

8, ఆగ 2026

కాణిపాకం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణతో ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర బ్రహ్మోత్సవాలకు శోభ
జిల్లా వార్తలు

కాణిపాకం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణతో ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర బ్రహ్మోత్సవాలకు శోభ

చంద్రగిరి నియోజకవర్గంలోని ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భరణి రోజున కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు డాక్టర్ కలికిరి మురళీమోహన్, పులివర్తి నాని దంపతులు పాల్గొని ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రార్థించగా, భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీరు, నిత్యాన్నదానం, ఉచిత లడ్డు, మజ్జిగ పంపిణీ వంటి ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు.

7, ఆగ 2026

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే దీక్షలు ప్రారంభం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే దీక్షలు ప్రారంభం

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై CBI దర్యాప్తు, మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీ ఎంబర్సిమెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. మునిసిపల్ ఆఫీస్ ఎదుట జరుగుతున్న ఈ దీక్షల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వరుసగా పాల్గొంటూ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

6, ఆగ 2026

శక్తి యాప్‌ ద్వారా మహిళలకు తక్షణ రక్షణ – మైనర్ల డ్రైవింగ్‌ అత్యంత ప్రమాదకరం: మహానంది ఎస్ఐ
జిల్లా వార్తలు

శక్తి యాప్‌ ద్వారా మహిళలకు తక్షణ రక్షణ – మైనర్ల డ్రైవింగ్‌ అత్యంత ప్రమాదకరం: మహానంది ఎస్ఐ

నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురంలో మహిళల భద్రత, బాలల హక్కులు, సైబర్ నేరాలపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఎస్ఐ ఎస్. రామ్మోహన్ రెడ్డి శక్తి యాప్‌ ద్వారా మహిళలు ఆపద సమయంలో తక్షణ పోలీసు సహాయం పొందవచ్చని వివరించి, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మైనర్ల డ్రైవింగ్‌ ప్రమాదాలు, అత్యవసర సేవల నంబర్ల వినియోగంపై పాల్గొన్న వారికి సూచనలు చేశారు.

6, ఆగ 2026

రాయచోటి వద్ద గంజాయి పట్టివేత: బీహార్ వ్యక్తి అరెస్ట్
జిల్లా వార్తలు

రాయచోటి వద్ద గంజాయి పట్టివేత: బీహార్ వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లా రాయచోటి వద్ద గంజాయి అక్రమ విక్రయంపై పోలీసులు దాడి చేసి బీహార్‌కు చెందిన హర్మోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, మాదక ద్రవ్యాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, రాయచోటి పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

5, ఆగ 2026

మొరంపల్లి బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రారంభం
జిల్లా వార్తలు

మొరంపల్లి బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రారంభం

చిత్తూరు జిల్లా ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీలో చిన్నారి విద్యార్థుల కోసం నూతన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా రెండు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తొలగి, ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు స్వగ్రామంలోనే సురక్షిత, సౌకర్యవంతమైన విద్యా సదుపాయం లభించడంతో తల్లిదండ్రులు, స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

5, ఆగ 2026

ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాణంలో కార్తి–మోహన్ రాజా కొత్త సినిమా
సినిమా

ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాణంలో కార్తి–మోహన్ రాజా కొత్త సినిమా

హీరో కార్తి, దర్శకుడు మోహన్ రాజా కలయికలో ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాణంలో కొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రకటించారు. మోహన్ రాజా స్వీయ కథతో తెరకెక్కనున్న ఈ కమర్షియల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా, షూటింగ్‌ను 2026 చివర్లో ప్రారంభించేలా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే కార్తి ‘సర్దార్ 2’, ‘మార్షల్’తో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు చిత్రంతో కూడా బిజీగా ఉన్నారు.

4, ఆగ 2026

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
జిల్లా వార్తలు

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

31, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట
జాతీయం

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట

కోల్ స్కామ్‌లో నమోదైన క్రిమినల్ కేసు నుంచి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ఊరట కల్పించింది. సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ, 2015లో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లు, అప్పటి తీర్పును రద్దు చేసి విచారణను ముగించింది. యూపీఏ కాలం నాటి ఈ పెద్ద కేసులో ఆయనపై నేరాభియోగాలకు బలమైన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

29, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు
జాతీయం

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది. సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

29, జులై 2026

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు
జిల్లా వార్తలు

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు

అనంతపురం జిల్లా కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు‌తో చర్చించారు. పాత విశాఖపట్నం విమానాశ్రయంలా వన్‌సైడ్ ల్యాండింగ్ విధానాన్ని కూడేరు వద్ద అమలు చేసే అవకాశాలపై మరోసారి సాంకేతిక సర్వే నిర్వహించాలని, ఉడాన్ పథకం కింద అనంతపురం జిల్లాను చేర్చి హార్టికల్చర్ అభివృద్ధికి తోడ్పడాలని వారు కేంద్రాన్ని కోరారు.

28, జులై 2026

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్
జాతీయం

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నేటి యువతను ఆదేశాలతో కాదు, అర్థవంతమైన సంభాషణల ద్వారా అర్థం చేసుకోవాలని, కుటుంబాల్లో సంభాషణల లోపం ఆందోళనకరమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలోని ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో కపిల్ సిబల్, జంతర్ మంతర్ నిరసనలపై భగవత్ మౌనాన్ని సోషల్ మీడియాలో విమర్శించారు.

25, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్‌పై హాట్ డిబేట్
సినిమా

‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్‌పై హాట్ డిబేట్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ ప్రమోషనల్ కంటెంట్‌లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై వోల్టేజ్ యాక్షన్ ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కియారా అద్వానీ, తారా సుతారియా తదితర హీరోయిన్లపై వరుసగా వస్తున్న రొమాంటిక్ పాటలు కథకు ఎంతవరకు ఉపయోగపడతాయనే ప్రశ్నల మధ్య, ఆగస్టు 26న విడుదలైన తర్వాతే సినిమా అసలు స్వరూపం తెలిసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

23, జులై 2026

‘మనసాగదే’.. యశ్‌ ‘టాక్సిక్‌’ నుంచి మరో క్రేజీ సాంగ్‌
సినిమా

‘మనసాగదే’.. యశ్‌ ‘టాక్సిక్‌’ నుంచి మరో క్రేజీ సాంగ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదల చేసిన ‘మనసాగదే..’ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందన పొందుతూ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోంది. నయనతార, కియారా అడ్వాణీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ‘కేజీఎఫ్‌’ విజయానంతరం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

21, జులై 2026

క్షణికావేశంలో కన్నకొడుకుని కొట్టి చంపిన తండ్రి
నేరాలు

క్షణికావేశంలో కన్నకొడుకుని కొట్టి చంపిన తండ్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం జరిగింది. క్షణికావేశంలో కన్నకొడుకుపై తండ్రి.. కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

17, జులై 2026

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..
రాజకీయాలు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్‌ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.

16, జులై 2026

ఏపీలో గాడితప్పిన పాలన :  స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

ఏపీలో గాడితప్పిన పాలన : స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

16, జులై 2026

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం   : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
రాజకీయాలు

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్

విమాన ప్రయాణికులను దోపిడీ చేసే స్థాయిలో ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడనివ్వబోమని పేర్కొన్నారు.

16, జులై 2026

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు
జిల్లా వార్తలు

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు

కడప జిల్లా ప్రొద్దటూరు లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాచమల్లు సునీల్ రెడ్డి, ఏ సమస్య వచ్చినా కొందరు నాయకులు వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును లాగి నెపం మోపడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఆరోపణల రాజకీయాలు చేస్తూ పాలన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఈ ధోరణిని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

16, జులై 2026

ముద్రగడ పద్మనాభం పాడె మోసిన  వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్

ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైయస్ జగన్

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. పాడెను మోసి, ఆయన పట్ల తనకున్న గౌరవం, ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.

15, జులై 2026

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్
రాజకీయాలు

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

15, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters