ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది.  శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 846.10 అడుగులు, నీటి నిల్వ  72.1974 టీఎంసీలుగా నమోదయింది.