సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం..

కొత్త కెప్టెన్ శ్రేయస్‌కు పూర్తి మద్దతు

భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (SKY) ను ఆ బాధ్యతల నుంచి బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) హఠాత్తుగా తప్పించింది. ఆయన స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయాస్ ను కొత్త టీ20 కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత టీ20 జట్టు ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆయన కెప్టెన్సీలో టీం ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు మెగా టోర్నీల్లోనూ తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ను కూడా భారత్ ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో, ఇలాంటి విజయవంతమైన కెప్టెన్‌ను అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కెప్టెన్సీ మార్పు వార్త బయటకు వచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుంచి మొదటి అధికారిక స్పందన వెలువడింది. ఈ పరిణామంపై ఆయన తీవ్ర ఆవేదనకు, భావోద్వేగానికి గురైనట్లు జట్టు వర్గాల సమాచారం. ఇన్నాళ్లూ జట్టును విజయపథంలో నడిపించిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై సూర్యకుమార్ యాదవ్ మనస్తాపం చెందినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తన హుందాతనాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ నేతృత్వంలోని జట్టుకు ఆయన అభినందనలు తెలిపినట్లు సమాచారం. రాబోయే కాలంలో టీం ఇండియా ఎదుర్కోబోయే సరికొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలని, కొత్త జట్టుకు స్ఫూర్తినిచ్చేలా SKY సందేశం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశం కోసం ఆడటమే ఎప్పుడూ తన మొదటి ప్రాధాన్యత అని, నాయకుడిగా ఉన్నా లేకపోయినా జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటానని సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేసినట్లు పేర్కొంటున్నారు.

BCCI వ్యూహాత్మకంగా శ్రేయాస్ కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, ఆయన నాయకత్వంలో టీం ఇండియా ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ , ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత టీ20 జట్టును ఎలా నడిపిస్తాడో చూడాల్సి ఉంది.