రాయలసీమ న్యూస్, నంద్యాల: బనగానపల్లె: రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు రూ.2,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని సంజామల టిడిపి యువ నాయకుడు, హైకోర్టు అడ్వకేట్ అలీ హుస్సేన్ తెలిపారు. కోవెలకుంట్ల పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
జిల్లా కేంద్రాల్లో మాత్రమే అమలులో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మొత్తం బనగానపల్లె నియోజకవర్గానికి విస్తరించే ప్రణాళిక రూపొందించడం చారిత్రాత్మక నిర్ణయమని అలీ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. అలాగే బనగానపల్లె బైపాస్ రోడ్డు నిర్మాణం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముందుచూపుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పనులు ఇప్పటికే సుమారు 70 శాతం పూర్తయ్యాయని ఆయన వివరించారు.
అదేవిధంగా రూ.1.95 కోట్లతో కొత్త గ్రామపంచాయతీ భవనం, మైనార్టీల కోసం కొత్త షాదీఖానా, ఆర్డీవో కార్యాలయం, ఎంఆర్వో కార్యాలయ భవనం నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. యాగంటి దేవస్థానంలో రూ.5.80 కోట్లతో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి పనులు కూడా మొదలయ్యాయని చెప్పారు.
వివిధ శాఖల ద్వారా మంజూరైన నిధుల వివరాలను వెల్లడిస్తూ పంచాయతీరాజ్ శాఖకు రూ.127 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య RWS శాఖకు రూ.611 కోట్లు, బీసీ సంక్షేమానికి సుమారు రూ.7 కోట్లు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ PIUకు రూ.56.36 కోట్లు, ఇరిగేషన్ శాఖకు సుమారు రూ.7 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.8 కోట్లకు పైగా, క్రీడల అభివృద్ధికి రూ.2.64 కోట్లు, రోడ్లు మరియు భవనాల శాఖకు రూ.212 కోట్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.177.29 కోట్లు మంజూరై పనులు కొనసాగుతున్నాయని అలీ హుస్సేన్ తెలిపారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన సొంత నిధులతో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇది అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బనగానపల్లె నియోజకవర్గానికి కనీసం రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కూడా జరగలేదని ప్రజలకు తెలిసిందేనని అన్నారు.
అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పై వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శలు చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని అలీ హుస్సేన్ వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే ముందు గత ఐదేళ్లలో వారు చేసిన అభివృద్ధిని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ప్రజల ముందుంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీ జనార్దన్ రెడ్డి అంటే బనగానపల్లె అభివృద్ధి ప్రదాత. రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోని ప్రముఖ నాయకుల్లో ఆయన ఒకరు. అలాగే రాబోయే 2029 శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లె ప్రజలు అభివృద్ధికి మరోసారి పట్టం కడతారని, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 వేలకుపైగా మెజారిటీతో విజయం సాధిస్తారని నా వ్యక్తిగత రాజకీయ విశ్వాసం.
అని హైకోర్టు అడ్వకేట్, టిడిపి లీగల్ సెల్ నియోజకవర్గ నాయకుడు గాలే సాహెబ్ అల్లి హుస్సేన్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బోధనం బాలనాగన్న, మహబూబ్ బాషా, లక్ష్మయ్య, మునిస్వామి, అడ్వకేట్ హుస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు.













