రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు శుక్రవారం పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్‌లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్‌లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు.







