రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ప్రచారానికి వేగం తెచ్చే క్రమంలో కీలక నియామకం జరిగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషాను ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్గా నియమించారు. ఈ మేరకు ఏపీసీసీ విడుదల చేసిన అధికారిక నియామక ఉత్తర్వుల్లో ఇర్ఫాన్ బాషా పేరును ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, శ్రేణులతో సమన్వయం చేస్తూ ఇర్ఫాన్ బాషా కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం జిల్లాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
స్థానిక ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, పార్టీ ఉద్యమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇర్ఫాన్ బాషా చూపిన చొరవ, కృషిని పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంతోనే ఆయనకు ఏపీసీసీ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.
“తనపై నమ్మకం ఉంచి ఏపీసీసీ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డికి, డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ప్రచారం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు చేపడతానని ఇర్ఫాన్ బాషా అన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.













