బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రధాన్

28 articles

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు
జాతీయం

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నెలరోజుల పాటు విద్యార్థుల నిరసనలు కొనసాగగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ దీర్ఘకాలిక ఆందోళనల మధ్య తరచూ కలుసుకుంటూ వచ్చిన కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమగా మారి చివరకు పెళ్లి బంధాలకు దారి తీసింది. ఈ జంటల కథలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.

31, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలకడం, ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా, పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు పార్టీ సంస్థలో కొత్త బాధ్యతలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నాయకత్వం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

27, జులై 2026

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'..   కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!
జాతీయం

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'.. కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

26, జులై 2026

ఇది ఆరంభం మాత్రమే..: అభిజీత్ దీప్కే మరో వీడియో
జాతీయం

ఇది ఆరంభం మాత్రమే..: అభిజీత్ దీప్కే మరో వీడియో

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు
జాతీయం

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.

25, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
జాతీయం

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ (CJP) తెగేసి చెప్పింది. లేకుంటే కేంద్రంతో చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని తేల్చిచెప్పారు.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?..  స్పష్టం చేసిన కేంద్రం..!
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?.. స్పష్టం చేసిన కేంద్రం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.

24, జులై 2026

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం
జాతీయం

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థ సంక్షోభానికి ఆయనే బాధ్యుడని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు..

24, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌లోని తమ నిరసనలను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ స్పష్టం చేసింది. సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించినా ఉద్యమం ఆగదని, కేంద్రంతో చర్చలు జరిగినా ప్రధాన్ రాజీనామాపై రాజీ ఉండదని అభిజీత్ దిప్కే తెలిపారు. నిరసనకారులపై కేసులు పెట్టకపోవడం, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
జాతీయం

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

23, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం
జాతీయం

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం

నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు హింస, విద్వేష నినాదాలతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత కోసం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కొంతమంది హింసాత్మక, మత విద్వేష, రాజకీయ ఎజెండాలతో హైజాక్ చేశారని వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి. ప్రధాని, హిందూ మతం, రామ మందిరం, భారత సైన్యం, ఆర్టికల్ 370, UAPA కేసుల నిందితుల విడుదల వంటి అంశాలు ముందుకు రావడం నిరసన అసలు లక్ష్యాన్ని మసకబార్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

22, జులై 2026

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం
జిల్లా వార్తలు

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం

నీట్‌ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. కడపలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, ధర్నాలో నాయకులు విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, పరీక్షలపై నమ్మకం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పరీక్షా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, బాధ్యులపై కఠిన చర్యలు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ
జాతీయం

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ

భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

13, జులై 2026

జులై 20న పార్లమెంట్ మార్చ్! :  కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
జాతీయం

జులై 20న పార్లమెంట్ మార్చ్! : కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 20న పార్లమెంట్ వరకు శాంతియుత పాదయాత్రకు పిలుపునిచ్చింది.

10, జులై 2026

ఏపీ విద్య విధానంపై  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ విద్య విధానంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు.

30, జూన్ 2026

కాక్రోచ్‌ పార్టీ డైపర్ల ఉద్యమం : జంతర్ మంతర్ వద్ద  కొనసాగుతున్న నిరసనలు
జాతీయం

కాక్రోచ్‌ పార్టీ డైపర్ల ఉద్యమం : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు

‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి.

23, జూన్ 2026

ధైర్యంగా పరీక్షకు వెళ్లండి: నీట్‌ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ సూచన
విద్య

ధైర్యంగా పరీక్షకు వెళ్లండి: నీట్‌ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ సూచన

దేశవ్యాప్తంగా జరుగుతున్న NEET-UG re-exam సందర్భంగా దాదాపు 22 లక్షల మంది హాజరుకానుండగా, విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, admit card, గుర్తింపు కార్డు, ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని NTA సూచించింది. ప్రశ్నపత్ర లీకేజీ వివాదాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సామాజిక మాధ్యమాలపై నిఘా, పోలీసు బందోబస్తు కల్పించారు.

21, జూన్ 2026

నెల్లూరు జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ నిధుల విడుదలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ నిధుల విడుదలకు సిద్ధం

నెల్లూరు జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ పథకాల తొలి సంయుక్త విడతగా మొత్తం రూ.117.16 కోట్లను ఈరోజు మధ్యాహ్నం నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లాలో 1,77,545 మంది ‘అన్నదాత సుఖీభవ’, 1,41,921 మంది ‘పీఎం కిసాన్’ లబ్ధిదారులు ఉండగా, ప్రతి కుటుంబానికి వరుసగా రూ.5,000, రూ.2,000 చొప్పున అందించనున్నారు.

20, జూన్ 2026

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన
జాతీయం

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

20, జూన్ 2026

కాక్రోచ్ ఎవరికీ భయపడదు!
జాతీయం

కాక్రోచ్ ఎవరికీ భయపడదు!

కాక్రోచ్‌ జనతా పార్టీ అధినేత అభిజీత్‌ దీప్కే, పరీక్షల వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వారం రోజుల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, జంతర్‌మంతర్‌ ధర్నా కేవలం ట్రయలర్‌ మాత్రమేనని, ఈ ఉద్యమాన్ని త్వరలో జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.

8, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters