రాయలసీమ న్యూస్, చిత్తూరు: పుంగనూరు: ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించగా, 37 రోజుల వ్యవధిలో మొత్తం రూ.87,20,769 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఉప కమీషనర్ J. ఏకాంబరం తెలిపారు.
గురువారం ఆలయంలో హుండీ లెక్కింపును దేవదాయ శాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది సమక్షంలో నిర్వహించారు. హుండీ నుండి బంగారం 23.005 గ్రాములు, వెండి 250.012 గ్రాములు వెలికితీశారు. భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించింది.
విదేశీ కరెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి: బ్యాంకు అఫ్ టాంజానియా 5000 షిల్లింగ్ 2 నోట్లు, 2000 షిల్లింగ్ 3 నోట్లు, సెంట్రల్ బ్యాంకు అఫ్ కువైట్ 1 డాలర్ నోట్, బ్యాంకు అఫ్ కెనడా 10 డాలర్స్ నోట్లు 5, సెంట్రల్ బ్యాంకు అఫ్ ఒమాన్ 100 బైస 2 నోట్లు, సౌదీ అరేబియా మైనారిటీ ఏజెన్సీ 1 రియల్ నోట్లు 7, సెంట్రల్ బ్యాంకు అఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో 10 డాలర్స్ నోట్లు 10, థాయిలాండ్ 20 థాయ్ భాట్ 1 నోట్ లభించాయి.
అన్నదాన కేంద్రం వద్ద గల హుండీ ద్వారా రూ.12,873 ఆదాయం వచ్చింది. శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ నుండి రూ.65,851 ఆదాయం నమోదైంది. మొత్తం హుండీ లెక్కింపును అధికారులు, సిబ్బంది సమక్షంలో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.
హుండీ లెక్కింపులో దేవస్థాన ఉప కమీషనర్ & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ S. శశి కుమార్, చౌడేపల్లి పోలీసు సిబ్బంది, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చౌడేపల్లి శాఖ ప్రతినిధులు, దేవస్థాన అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.













