తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏ ఆర్ ఎకోసిస్ సంస్థ చేపట్టిన స్వచ్ఛ తిరుపతి కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కపిలతీర్థం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పరిశుభ్రత, చెత్త నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం గురించి సూచనలు చేశారు.

తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా మాత్రమే కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శ నగరంగా నిలవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుపతిలో మాత్రమే కాకుండా చంద్రగిరి ప్రాంతంలో కూడా చెత్తను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేసే కార్యక్రమాలకు ఏ ఆర్ ఎకోసిస్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే నాని సూచించారు. సంస్థకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఏ ఆర్ ఎకోసిస్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.... ఒక్క తిరుపతిలోనే కాకుండా చంద్రగిరిలో కూడా చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ముందుకు రావాలి. ఏ ఆర్ ఎకోసిస్ సంస్థ తిరుపతి ని శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

స్వచ్ఛ తిరుపతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా విభజించి, ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజూ సేకరించే విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే నాని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించడం ద్వారా ప్రతి పౌరుడు స్వచ్ఛ తిరుపతికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వచ్ఛ తిరుపతిలో భాగంగా ప్రతి ఇంట్లో తడి పొడి చెత్తలను వేరువేరుగా ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజు సేకరించాలి. బహిరంగ ప్రదేశాలలో కాకుండా పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించి స్వచ్ఛ తిరుపతికి ప్రతి పౌరుడు దోహదపడాలి. ఆ సంస్థకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి.

నా ఇల్లు, మన వీధి, మన తిరుపతి శుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ తిరుపతి సాధ్యం... అందరం కలిసి పని చేద్దాం మన తిరుపతిని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుదాం నినాదంతో పయనిద్దాం.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్, ఏపీ గ్రీనరీ & బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, ఏ ఆర్ ఎకోసిస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా పరిశుభ్రతపై అవగాహన పెంచేలా నినాదాలు, సూచనలు ప్రజలకు తెలియజేశారు.