రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప, : హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నేపథ్యంలో ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి వద్ద, కార్యాలయాలు, వాణిజ్య సంస్థల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలన్న పిలుపు మేరకు కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. యుగంధర్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన దేశ గౌరవం, ఐక్యత, దేశభక్తి పరిరక్షణలో జాతీయ జెండా ప్రాధాన్యతను వివరించారు.
జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు, దేశభక్తికి ప్రతీక అని తెలిపారు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కడప జిల్లాలో విస్తృతంగా నిర్వహించేందుకు వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది చురుకుగా భాగస్వాములు కావాలని డా. యుగంధర్ సూచించారు. ప్రతి స్థాయిలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య సిబ్బంది తమ తమ ఆరోగ్య సంస్థలలో జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు, తమ ఇళ్ల వద్ద కూడా జాతీయ జెండాను ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో డా. ప్రవీణ్, DIO, డా. మహమ్మద్ తాహా, DPMO, డా. అరిఫుల్లా, PO-RBSK, Dr హీరేందర్, శ్రీ రమేష్ SO, శ్రీ విజయ భాస్కర్‌తో పాటు డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం కావాలని పాల్గొన్నవారు ఆకాంక్షించారు.













