రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా RTPP: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు గురువారం వైఎస్సార్ కడప జిల్లాలోని డాక్టర్ ఎం.వి.ఆర్. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (RTPP)లో కాంట్రాక్ట్ కార్మికులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రధాన గేటు వద్ద జరిగిన ఈ సమావేశంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
సమావేశంలో ఏఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, డిమాండ్లపై నాయకులు మాట్లాడారు. RTPPలో పనిచేస్తున్న ఏఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదకరమైన ప్రదేశాల్లో రాత్రి పగలు సేవలందిస్తున్నప్పటికీ, తగిన గుర్తింపు, సౌకర్యాలు, ప్రభుత్వ జీవో అమలు విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని కార్మిక నాయకులు ఆక్షేపించారు.

ఏఎంసీ కాంట్రాక్ట్ కార్మిక నాయకుడు ఆదినారాయణ మాట్లాడుతూ, 2019 నుంచి గత ఎనిమిదేళ్లుగా RTPPలో కోల్డ్ శాంపిల్, కోల్ క్లీనింగ్, లైటింగ్, సూట్ జాములు, యాస్ ప్లాంట్ వంటి విభాగాల్లో ఏఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు నిరంతరం సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ పనులు ఎక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ, కార్మికుల హక్కులు, రక్షణ, శ్రేయస్సు విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
2019 నుంచి 8 సంవత్సరాలుగా ఏఎంసీ కాంటాక్ట్ కార్మికులకు ఆర్టీపీపి సంస్థలో కోల్డ్ శాంపిల్ కోల్ క్లీనింగ్ లైటింగ్ సూట్ జాములు యాస్ ప్లాంట్ నందు ప్రమాదకరమైన ప్రదేశాల్లో రాత్రి పగలు సేవలందిస్తున్న ఏఎంసీ కార్మికులకి 129 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు
ఆదినారాయణ పేర్కొన్న 129 జీవో అమలు కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు ఏకమై పోరాటం కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. RTPPలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సేవా పరిస్థితులు, వేతనాలు, భద్రతా చర్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు కార్మిక వర్గాలు తెలిపాయి.
గేట్ మీటింగ్‌లో పాల్గొన్న కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. జీవో 129 అమలు ద్వారా ఏఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు అభిలషించారు.













