ప్రొద్దుటూరు మండల పరిషత్ అధికారి వారి కార్యాలయ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి శ్రీ సూర్యనారాయణ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, అక్కడికి విచ్చేసిన మండల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో దేశ స్వాతంత్ర్యం, మహనీయుల త్యాగాల గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవనం, అభివృద్ధి వెనుక ఉన్న త్యాగస్ఫూర్తిని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం వల్లే దేశం ఈ స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.

దేశ ప్రజలు అందరూ ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నారు అంటే అలనాడు ఎంతో మహనీయుల త్యాగఫలం.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులూ, ప్రజాప్రతినిధులూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. యువతరం దేశాభివృద్ధిలో చురుకుగా భాగస్వాములు కావాలని, స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు ఆలపించగా, విద్యార్థులు దేశభక్తి కవితలు, ప్రసంగాలతో సందేశాత్మకంగా కార్యక్రమాన్ని అలంకరించారు.

ఈ వేడుకలో Deputy MPDO బాలన్న, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు జేష్ఠది భాస్కర్, సునీల్ జయపాల్, రాభర్ట్, మధు పుష్పరాజ్, జాస్పర్ షాలేం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హాజరైన ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.

మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం జాతీయ పతాకాలతో, రంగురంగుల కండెలతో అలంకరించగా, దేశభక్తి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు.