రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రొద్దుటూరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఏ. సురేష్ కుమార్ తెలిపారు.
ఈ నెల 19వ తేదీ బుధవారం ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న SKSC డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభమవుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా స్కిల్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
పదవ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ వంటి విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వివిధ ప్రైవేట్ సంస్థలు ఈ మేళాలో పాల్గొని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నిరుద్యోగులు 9581670585 నంబర్‌ను సంప్రదించవచ్చని జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఏ. సురేష్ కుమార్ వెల్లడించారు.













