రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నారా లోకేష్, Telugu Desam Party పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే అక్టోబర్‌లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు Telugu Desam Party కి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
కడప జిల్లా MP అవినాష్ రెడ్డి ఇంటిపై Enforcement Directorate తెల్లవారుజామున నిర్వహించిన సోదాలపై స్పందించిన రాచమల్లు, ఈ చర్యల వెనుక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే ఉందని అభిప్రాయపడ్డారు.
“నారా లోకేష్ నువ్వు వై.యస్.ఆర్.సి.పి నాయకులను ఎండగట్టడం కాదు, నిన్ను, మీ నాయనను రాబోయే అక్టోబరు లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఊరగాయ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు”
మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన సవాల్‌ను గుర్తుచేసుకుంటూ, రాచమల్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ కాలంలో ఉద్యోగ నియామకాలలో అవినీతి జరిగిందని ఎవరికైనా అనుమానం ఉంటే, దమ్ముంటే CBI విచారణకు ఆదేశించాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రాచమల్లు ప్రకారం, 2019-2024 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం 23,609 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. అదనంగా 1 లక్ష 35 వేల సచివాలయాల ఉద్యోగాలు కూడా భర్తీ చేసినప్పటికీ, ఆ నియామకాలపై అప్పటి Telugu Desam Party నాయకుల నుంచీ కూడా పెద్దగా విమర్శలు రాలేదని, ఇది ఆ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాల అమ్మకానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాల్పడిందని రాచమల్లు ఆరోపించారు. అభ్యర్థులతో పరీక్షలు కూడా నిర్వహించకుండా, కేవలం సర్టిఫికెట్ ఆధారంగా 300 పైగా ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేందుకు ప్రత్యేక G.O లు జారీ చేశారని, ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు కూడా Telugu Desam Party నాయకులే జారీ చేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి నీచమైన, దుర్మార్గ పాలన దేశంలో ఎక్కడైనా ఉంటే అది చంద్రబాబు కూటమి ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రభుత్వం 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పదేపదే ప్రచారం చేసుకోవడం, ఆ ప్రభుత్వానికి మాత్రమే సరిపడే డప్పు కొట్టుకోవడమని రాచమల్లు ఎద్దేవా చేశారు. మెగా DSC నియామకాల్లో శాతం 100 అవినీతి జరిగిందని, ఒక్కో ఉద్యోగాన్ని సుమారు 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడలేని నారా లోకేష్, జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాచమల్లు వ్యాఖ్యానించారు.













