రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లె పంచాయతీ అమృత్‌నగర్‌లో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి 50 కుటుంబాలు చేరాయి. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కొత్తగా చేరిన వారికి ఆయన వైఎస్సార్‌సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
అమృత్‌నగర్‌లో ఖాదర్ బాషా కుమారుడు నూర్ బాషా నాయకత్వంలో ఈ చేరికలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏకంగా 50 కుటుంబాలు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ పక్షం పట్టడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమృత్‌నగర్ ప్రాంతం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, మూడూ సార్లూ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీ ఇచ్చారు.
2006లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ అమృత్‌నగర్‌ను స్థాపించారు.
ఈ రోజూ నేను సవాల్ చేస్తున్నా... ఇన్ని రోజులు పాలించిన ప్రస్తుత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా? చర్చకు సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ హయాంలో ₹15 కోట్లతో 72 రోడ్లు, 2 ప్రధాన కాలువలు నిర్మించాం. నాగాయపల్లె నది నుంచి ₹70 లక్షలతో అమృత్‌నగర్‌కు మంచి నీటి పథకం తెచ్చాం. సచివాలయ వ్యవస్థతో పరిపాలనను ఇంటింటికీ తెచ్చింది మేం కాదా?
టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే ప్రజలకు నరకం చూపిస్తున్నదని ఆయన ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ మోసపూరిత హామీలపై ప్రజలు తిరగబడుతున్నారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి పేదల పొట్ట కొడుతున్నారు.
ఎన్నికల ముందు పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లుల భారం మోపారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారు!
ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా పేద ప్రజలను దారుణంగా మోసం చేశారు.
ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా టీడీపీ నాయకులు ఇంటింటి కార్యక్రమం అంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. హామీలపై సమాధానం చెప్పలేక, ప్రజలకు తమ ముఖాలను చూపించకుండా తప్పించుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆపేది లేదని, వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అమృత్‌నగర్ ప్రజలకు అండగా ఉంటుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
50 కుటుంబాల చేరికతో కొత్తపల్లె పంచాయతీలో వైఎస్సార్‌సీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నిండింది.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాతకోట వంశీధర్ రెడ్డి, వరికుంట్ల ఓబుల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కల్లూరు నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













