టీమిండియాకు టీ20లో కొత్త కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌

టీమిండియా టీ20 జట్టుకు కొత్త నాయకుడు ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసిన BCCI సెలక్షన్ కమిటీ, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించే క్రమంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మను నియమించారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల కోసం కూడా భారత టీ20 జట్టును ప్రకటించగా, ఆ జట్టుకు కూడా శ్రేయస్ అయ్యర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తిలక్ వర్మ ఆసియా క్రీడల జట్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ ఎంపికలతో టీమిండియా టీ20 నాయకత్వంలో మార్పు చోటుచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి, శ్రేయస్ అయ్యర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుస సిరీస్‌లు, ఆసియా క్రీడల దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే దిశగా ఈ జట్టు ఎంపిక సాగిందని భావిస్తున్నారు.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం

ఐపీఎల్ 2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున రాణించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు దక్కింది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై, అతడు అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ ఎంపికతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడిగా టీమిండియా తరఫున ఆడిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు

ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇలా ఉంది: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా.

ఇంగ్లండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20ల కోసం ప్రకటించిన జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు

సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల కోసం భారత టీ20 జట్టు ఈ విధంగా ఉంది: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.