రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: నంద్యాల జిల్లా తోట్లపల్లిలోని అచలానంద స్వామి ఆశ్రమ పరిసరాల్లో మత సంబంధ ఉద్రిక్తతలకు దారితీసే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ధార్మిక సదనం’ వెనుక భాగంలో కొండ గుట్టపై కొత్త చర్చి నిర్మాణం జరుగుతుండటం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అచలానంద స్వామి ఆశ్రమంలోని ఈ ధార్మిక సదనంలో కులమత భేదం లేకుండా ఆకలితో వచ్చే ప్రతి ఒక్కరికీ సంవత్సరం పొడవునా 365 రోజులు, రోజుకు మూడు పూటలా నిరంతర అన్నదానం నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి ప్రసాదంగా వేలాది మంది భక్తులు, పేదలు ఈ అన్నదానంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
అయితే, ఇదే సదనం వెనుక కొండపై నిర్మాణంలో ఉన్న చర్చి దృష్టికి రావడంతో మతమార్పిడి కార్యకలాపాలపై ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో చర్చి లేని ఊరు లేదనడం అతిశయోక్తి కాదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మంగారి మఠం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇప్పటివరకు దాదాపు 12కు పైగా చర్చిలు ఏర్పడ్డాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇలాంటి నిర్మాణాల వల్ల సమాజానికి కలుగుతున్న మేలేమిటి, వీటి అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే ప్రశ్నలు లేవుతున్నాయి. విమర్శకుల వాదన ప్రకారం, మతమార్పిడి తప్ప ఇలాంటి కట్టడాల ద్వారా సమాజానికి ఉపయోగకరమైన సేవలు ఎంతమేర జరుగుతున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఉన్న చర్చిలు, మసీదులు వంటి మత సంస్థలు సంవత్సరం పొడవునా 365 రోజులు, రోజుకు మూడు పూటలా వివక్ష లేకుండా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తున్న ఉదాహరణలు చూపించగలరా అనే ప్రశ్న ముందుకు వచ్చింది. సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడే సేవల కంటే, కేవలం ప్రార్థనలకే ప్రాధాన్యం ఇస్తున్న మత కట్టడాల అవసరంపై చర్చ నడుస్తోంది.
నిరంతర అన్నదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి నిజంగా ఉపయోగపడుతున్నామని ధైర్యంగా చెప్పగల మత సంస్థలు ఉంటే, అవి తమ సేవలను స్పష్టంగా చూపించాలని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నింపే సామర్థ్యం, సంకల్పం ఏ సంస్థకు ఉందో సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
అన్నం పెట్టే ధార్మిక కేంద్రాలు ఎక్కడున్నాయి, ఆకలిని ఆసరాగా చేసుకుని మతమార్పిడి చేసే కేంద్రాలు ఎక్కడున్నాయి అనే అంశంపై ప్రజలు ఆలోచించాలని సామాజిక వర్గాలు పిలుపునిస్తున్నాయి. బ్రహ్మంగారి ధార్మిక సదనం వెనుక చర్చి నిర్మాణం నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కుతోంది.













