రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: కదిరి: కదిరి పట్టణ మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు SIMS హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్ పర్యటించారు. వార్డులోని వివిధ వీధుల్లోకి వెళ్లి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా నిసార్ యాసీన్ సుమారు 300 ఇళ్లను సందర్శించినట్లు సమాచారం. ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాల పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన 6 కుటుంబాలను గుర్తించిన నిసార్ యాసీన్ వారికి ఆర్థిక సహాయం అందించారు. తమ శక్తి మేరకు అవసరమైన వారికి అండగా నిలవాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సంకల్పం వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు.
నిసార్ యాసీన్ పర్యటన సందర్భంగా వార్డులోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయాజ్, అంజార్, అల్లాబకాశ్, ఇబ్రహీమ్, ఇస్మాయిల్, సిద్ధిక్, ఫరూక్, అస్లాం, షాకీర్ తదితరులతో పాటు వందలాది మంది యువకులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. పర్యటన మొత్తం ఆయనతో కలిసి తిరిగి ప్రజల సమస్యలను వివరించారు.
నిసార్ యాసీన్ మాట్లాడుతూ, “ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం నా బాధ్యత అని అవసరమైన ప్రతి కుటుంబానికి నా శక్తి మేరకు అండగా నిలిచి ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యం” అని అన్నారు.
కదిరి 22వ వార్డులో నిసార్ యాసీన్ పర్యటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి వారి సమస్యలను వినడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు తక్షణ సాయం అందించడం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వార్డు ప్రజల సమస్యలపై ఆయన చూపిన ఆసక్తి, స్పందన స్థానికులకు ధైర్యం కలిగించినట్లు వారు పేర్కొన్నారు.













