రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: సత్య సాయి జిల్లా కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఆగస్టు 15న పుట్టపర్తిలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డును వరప్రసాద్ అందుకున్నారు.
ఈ పురస్కారాన్ని పురస్కరించుకుని కదిరి వాల్మీకి సంఘం నాయకులు వరప్రసాద్‌కు ఘన సన్మానం నిర్వహించారు. కదిరి స్థానిక RTO కార్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవా అవార్డు అందుకున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌ను పూలమాలలతో సత్కరించి, శాలువా కప్పి గౌరవించారు.
వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ వరప్రసాద్ తన విధుల్లో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవా భావం, నిబద్ధతతో పనిచేస్తున్నందువల్లే జిల్లా స్థాయి ఉత్తమ సేవా అవార్డు లభించిందని అభిప్రాయపడ్డారు. ఆయన సేవా ధోరణి ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వరప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని, ఇంకా ఉన్నత స్థాయిలో సేవలు అందించాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు. ప్రజలతో మమేకమై, పారదర్శకంగా విధులు నిర్వహించే అధికారులకు ఇలాంటి గుర్తింపు లభించడం ఆనందకరమని వారు తెలిపారు.
కదిరి RTO కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు గంగరాజు, నాగరాజు, హరికృష్ణ, ప్రసాద్, పట్నం మహేష్, ఈశ్వరయ్య, ఎర్రదొడ్డి అంజి, పూల సురేష్, మెకానిక్ ప్రసాద్, గిరి, అంజి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వరప్రసాద్‌తో కలిసి సంఘం నాయకులు స్మారక చిత్రాలు దిగారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా అవార్డు అందుకోవడం ద్వారా వరప్రసాద్ పేరు స్థానికంగా మరింత ప్రాచుర్యం పొందింది. ప్రజలకు సేవ చేయడంలో, వాహనాల తనిఖీల్లో, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో ఆయన చూపుతున్న చొరవను స్థానిక సంఘాలు ప్రశంసిస్తున్నాయి.













